గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మొదటి వీడియోలోని సందేశం

 


మిత్రులారా!

నేను మీతో ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించదల్చుకున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే మన ప్రభుత్వానికి విద్యారంగానికి సంబంధించి ఉన్న ఆలోచన సరళి ఏమిటి? అదే ఆలోచన సరళిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఎకడమిక్ సిబ్బంది మరియు నాన్ ఎకడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరియు ప్రభుత్వం యొక్క నిర్దేశిత లక్ష్యాలను ఎలా సాధించగలము అనేది వివరించదల్చుకున్నాను. మనం భౌతిక శాస్త్రంలో అనునాదం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఒకే ఫ్రీక్వెన్సీ లో ఉన్నట్లయితే మనము ఫలితాలను మరింత వేగవంతముగా ప్రభావవంతముగా పొందగలము.

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా సెక్రటేరియట్ లోను విభాగాధిపతుల కార్యాలయాలలోనూ క్షేత్ర పర్యటనలలోనూ విద్యాశాఖ పనితీరును సమీక్షించటం జరుగుచున్నది క్షేత్ర పర్యటనలలో నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవడం కోసం ఇకపై ప్రతినెల చివరి వారంలో ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గ్రామ సచివాలయాల్లోని విద్యాశాఖకు సంబంధించిన సిబ్బంది మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఉప విద్యాశాఖ అధికారుల కార్యాలయ సిబ్బంది జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది విద్యాశాఖ కమిషన్ రేట్ సిబ్బంది సెక్రటేరియట్ సిబ్బంది అందరూ భాగస్వాములుగా ఉండాలి.ఈ మొదటి వీడియోలో ఐదు అంశాల గురించి మీతో చర్చిస్తాను.

మొదటి అంశం: TAB ల వినియోగం

గత 20 నుండి 25 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బోధనాభ్యాసనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే మరి ఏ ఇతర దేశంలోనూ లేని విధంగా, మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధముగా ఒకేసారి 4లక్షల 60 వేల మంది 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు  మరియు 60 వేల మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు TAB లను అందించటం జరిగింది. వీటి యొక్క వినియోగానికి సంబంధించి నాలుగు అంశాలను మనం చూసినట్లయితే మొదటగా సాంసంగ్ కంపెనీ వారికి చెందిన నాణ్యమైన ఆకర్షణీయమైన TAB లను విద్యార్థులకు అందించాము వాటికి భద్రత కలిగిన SD కార్డులను ఏర్పాటు చేసాము BYJUS వారి నాణ్యమైన కంటెంట్ ను విద్యార్థులకు అందించాము. పై చర్యల ద్వారా మనం కేవలం 50 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాదించగలిగాము మిగిలిన 50 శాతం వాటి వినియోగంపై ఆధారపడి ఉంది ఇది ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు మాత్రమే సాధించగలరు. విద్యార్థులకు ట్యాబుల యొక్క వినియోగం గురించి 21 రోజులు చెప్పినట్లయితే అది వారికి అలవాటుగా మారుతుంది అదే విద్యార్థులకు 90 రోజులపాటు టాటుల వినియోగం గురించి చెప్పినట్లయితే వారు ట్యాబుల వినియోగాన్ని తమ జీవన శైలిగా మార్చుకొనగలరు.

రెండవ అంశం: టైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు

మనదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో రెట్టింపు ఖర్చుతో టైలింగ్యువల్ పాఠ్యపుస్తకములను ముద్రించటం జరిగినది. గత మూడు సంవత్సరాలుగా ఈ పుస్తకాలను మనం విద్యార్ధులకు అందిస్తున్నాము..

ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రశ్న పత్రములను సైతం రెండు భాషల్లో ముద్రిస్తున్నాము. అయినప్పటికీ కొద్దిమంది విద్యార్ధులు మాత్రమే మ్యాథమెటిక్స్ లేదా సైన్సెస్ ఆంగ్ల భాషను అందుకోగలుగుతున్నారు. నాలుగో తరగతి నుండి 8వ తరగతి వరకు మనం టార్గెట్గా ఉంచుకొని మనం పని చేయవలసి ఉంది.

మూడవ అంశం: జగనన్న విద్యా కానుక

దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్లకు పైగా ఖర్చుపెట్టి స్కూల్ బ్యాగ్ బూట్లు నోట్ పుస్తకములు బెల్టు వంటి పది రకాలకు పైగా వస్తువులను మనం విద్యార్థులకు అందిస్తున్నాము నేను ఇటీవల 20 కిలోమీటర్ల దూరంలోని ఒక పాఠశాలను సందర్శించినప్పుడు ఆ పాఠశాలలోని ఏ ఒక్క విద్యార్థి కూడా బూట్లు ధరించి గాని లేదా బెల్టును ధరించి గాని కనిపించలేదు ఇది బాధాకరమైన విషయం కనుక ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ ప్రతి రోజు విద్యార్థులను ప్రొత్సహించడం ద్వారా జగనన్న విద్యా కానుక ద్వారా అందించబడిన వస్తువులను ఉపయోగించే అలవాటును విద్యార్థులలో పెంపొందించాలి.

నాలుగవ అంశం: జగనన్న గోరుముద్ద

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో గాని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి రెట్టింపుకు పైగా వ్యయం జరుగుచున్నది. జగనన్న గోరుముద్ద పథకాన్ని సక్రమంగా నిర్వహించాలంటే ఆ పథకానికి అవసరమైన గుడ్లు చిక్కి ల వివరాలు ఎప్పటికప్పుడు మనము యాప్ లో అప్లోడ్ చేయాలి అప్పుడే మనకు అవసరమైన ఇండెంట్ జనరేట్ అవుతుంది మనము సకాలంలో విద్యార్థులకు అందించగలము.

ఐదవ అంశము: నాడు నేడు

నాడు నేడు పథకంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ఈ పథకం ద్వారా జరుగుచున్నది. ఈ పథకం ద్వారా పాఠశాలలో నిర్వహింపబడే టాయిలెట్ల మెయింటెనెన్స్, ఆర్ వో సిస్టమ్స్, బెంచీలు సక్రమంగా మెయింటెనెన్స్ జరగాలి. మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు దీనిపై

అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రవీణ్ ప్రకాష్

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top