ఎఫ్ ఏ - 3 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముఖ్య సూచనలు
> గత సంవత్సరం కొందరు ఆగంతకులు కొన్ని జిల్లాలలో ప్రశ్నాపత్రములు లీక్ చేయడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా ఈ సంవత్సరం అన్ని తరగతులకు (1-10) చెందిన ప్రశ్నాపత్రాలను ప్రతి రోజు మండల కేంద్రం నుండి మాత్రమే పంపిణీ చేయాలని ఉన్నాతాధికారులు ఆదేశించడం జరిగింది.
> విద్యార్ధులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాధానాలు ఒకే ఓ ఎం ఆర్ నందు గుర్తించవలసి ఉంటుంది. > ఓ ఎం ఆర్ నందు సబ్జెక్టుల పేర్లు నమోదు చేయబడి ఉంటాయి.
> ఏ సబ్జెక్టుకు సంబందించిన సమాధానాలు ఆ సబ్జెక్టు దిగువన ఉన్న సర్కిల్స్ నందు మాత్రమే గుర్తించాలని విద్యార్థులకు తెలియజేయాలి.
> ఓ ఏం ఆర్ పై విద్యార్థి పేరు, పాఠశాల యుడైస్ కోడ్ మరియు తరగతి ఇవ్వబడతాయి. > విద్యార్ధులకు ప్రశ్నా పత్రాలు పంపిణీ చేసిన వెంటనే దానిపై పాఠశాల యు డైస్ కోడ్, విద్యార్థి ఐ డి, తరగతిని ఉపాధ్యాయుడు నమోదు చేయాలి లేదా విద్యార్థులచే నమోదు చేయించాలి.
> ప్రశ్నాపత్రం పై జవాబులను టిక్ మార్క్ చేయడం లేదా ఏ బి సి డి లను నమోదు చేయడం ద్వారా గుర్తించాలని విద్యార్థులకు తెలియజేయాలి. > బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో ఓ ఏం ఆర్ షీట్ పై సర్కిల్స్ బబ్లింగ్ చేయడం ద్వారా జవాబులను గుర్తించాలని తెలియజేయాలి. ఎట్టి పరిస్థితులలో పెన్సిల్ ఉపయోగించరాదు.
> 1 - 3 తరగతుల విద్యార్థులకు సంబంధించి ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలను ఉపాధ్యాయులే గట్టిగా చదివి విద్యార్థులకు వినిపించాలి. చదివే సమయంలో ఎలాంటి క్లూలు ఇవ్వరాదు.
> విద్యార్ధులే సమాధానాలను ప్రశ్నా పత్రం పై టిక్ చేయడం ద్వారా గుర్తించేటట్లు చూడాలి. విద్యార్థి సమాధానాలు గుర్తించిన తరువాత ఒక్కొక్క విద్యార్థి ప్రశ్నా పత్రాన్ని తీసుకొని విద్యార్ధి టిక్ చేసిన సమాధానాల ఆధారంగా ఉపాధ్యాయుడు ఓ ఎం ఆర్ షీట్ పై బబుల్ చేయాలి. విద్యార్థులు ఓ ఎం ఆర్ షీట్ ను నలపకుండా ఉండేటట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
> 4 - 8 తరగతుల విద్యార్థులకు సంబంధించి ప్రశ్నా పత్రాలపై సమాధానాలను టిక్ చేయడం మరియు ఓ ఎం ఆర్ షీట్ లోని సర్కిల్స్ బబుల్ చేయడం విద్యార్థులు చేయాలి. ఉపాధ్యాయులు చేయరాదు.
> ప్రతి రోజు పరీక్ష పూర్తైన వెంటనే ప్రతి విద్యార్థి వద్దనుండి ప్రశ్నా పత్రం తో పాటు ఓ ఏం ఆర్ షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.
> వినియోగించిన ఓ ఎం ఆర్ లన్నింటినీ తరగతివారీగా వరుసక్రమంలో ఉంచి పాఠశాలకు సంబంధించిన అన్ని ఓ ఎం అర్ లను కలిపి ఒకే పాలిస్ కవర్ నందు లేదా సరిపడినన్ని పాలిస్ కవర్లు నందు పైన క్రింద అట్టముక్కలు పెట్టి ప్యాక్ చేయాలి. ప్యాకెట్ పై తప్పనిసరిగా ఆబ్రాక్ట్ పెట్టి పంపాలి.
> సమాధానాలు గుర్తించిన ప్రశ్నాపత్రాలను ఉపాధ్యాయులు వెంటనే దిద్ది మార్కులను విద్యార్థులకు తెలియజేయాలి. సంబంధింత రిజిస్టర్లు నందు నమోదుచేయాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించాలి.
0 comments:
Post a Comment