వాట్సాప్.. మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ లో గ్లోబల్ వైడ్ లీడర్. ఈ దేశం.. ఆ దేశం అని లేదు.. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అన్న భేదం లేదు. ఈ భాష.. ఆ భాష అన్న తారతమ్యం లేదు.ఎక్కడైనా, ఎవరికైనా ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకూ.. సాధారణ మనిషి నుంచి బిజినెస్ మ్యాన్ ల వరకూ.. సమాచార మార్పిడికి దీనిని మించిన బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. అందుకే రోజురోజుకీ దీని వినియోగదారులు పెరుగుతున్నారు. అయితే దీనిలో ఉండే మంచి ఫీచర్లు చాలా మందికి తెలీదు. ముఖ్యంగా వాట్సాప్ లో ఉండే భాషా పరమైన సౌలభ్యాల గురించి అవగాహన ఉండదు. వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే ఈ లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకైతే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు. ఫలితంగా ప్రపంచంలోకి ఎక్కడి వ్యక్తితోనైనా సులభంగా మెసేజ్ చేయడానికి మన భావ వ్యక్తీకరణ చేయడానికి సాయపడుతుంది.
ఒకటి రెండు భాషలే మనం వాడుతున్నాం..
వాట్సాప్ లో పదుల సంఖ్యలో భాషా ఎంపికలు ఉన్నప్పటికీ మనం కేవలం రెండు లేదా మూడు భాషాలను వినియోగిస్తున్నాం. వాటిల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ వంటివి ఉంటున్నాయి. అయితే యాప్ నుంచి డైరెక్ట్ గా ఇతర భాషా మాట్లాడే వారితో మనం వారి భాషలోనే మాట్లాడవచ్చు. మనకు వారి భాష రాకపోయినా మనం ఎంచక్కా మెసేజ్ చేసేయ్య వచ్చు. దీనికి మీకు కావాల్సిందల్లా వాట్సాప్ లో ఈ భాషా ఎంపికలు ఎలా చేసుకోవాలి అన్న విషయంపై అవగాహన మాత్రమే. అందుకే వాట్సాప్ లోని ఈ ట్రిక్ ను మీకు పరిచయం చేయాలని ఈ కథనం ఇస్తున్నాం
ఇలా చేయండి చాలు..
మీరు మెసేజ్ పంపాలి అనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేసి చాట్ విండోను ఓపెన్ చేయండి.
చాట్ బాక్సులో మీకు వచ్చిన భాషలో మెసేజ్ ని టైప్ చేయండి.
మొత్తం మెసేజ్ టైప్ చేయడం అయిపోతే .. దానిని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. వెంటనే మీకు ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
ఆ పాప్ అప్ విండోలో ట్రాన్స్ లేటింగ్ అని ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
దానిని ఎంపిక చేసుకొని, ఏ భాషాలోకి ట్రాన్స్ లేట్ కావాలో మీకు కనిపిస్తున్న లిస్ట్ నుంచి దానిని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు వెంటనే ఆ భాషలోనికి మీ మెసేజ్ మారిపోతుంది. ఆ తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మీకు పంపాలనుకున్న వ్యక్తికి వారి భాషలోనే మెసేజ్ వెళ్లిపోతుంది.
0 comments:
Post a Comment