BRAGCET 2023 : APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!

తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది.అర్హులైన బాలబాలికలు ఆన్లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రా 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు..

* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్ఏజీ సెట్-2023)

సీట్ల సంఖ్య: 14,940.

సీట్ల కేటాయింపు:ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 15%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు.అర్హత:విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2022-23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థులు కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.

వయోపరిమితి:ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014 మధ్య; ఓసీ, బీసీ, బీసీ-సి విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి

దరఖాస్తు చేసే విధానం:.ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2023.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: 23.04.2023.


Download Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top