Child Care Leave : Child Care Doubts

Child Care Leave Application Form Child Care leave in AP Child care leave application Child Care Leave Rules latest Child Care Leave Rules PDF Child Care leave for State Government employees Child Care leave Application AP AP Child care leave Rules in Telugu

60 నుండి 180 రోజులకు పెంచుతూ చైల్డ్కర్ లీవ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో. 33 తేది: 8-3-2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

1. 60 రోజులు సీరియల్ను విడతకు 20 రోజులు మించకుండా కనీసం 3 విడతల్లో మంజూరుచేయాలి. 

2.180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం,

3. ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.

4. 40శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.

5. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

6. మహిళా ఉద్యోగులు, టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరు చేస్తారు.

7. పిల్లల పరీక్షలు, అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి. కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్ధం.

8.సెలవు పత్రం సమర్పించి సీసీయల్పై వెళ్ళకూడదు. అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి. 

9.మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టిన తేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి. ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

10. ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకో వచ్చును.

11. ఆకస్మికేతర సెలవు (OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.

12. శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.

13. ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు సమాధానము: G.O.Ms.No. 132 పాయింట్ 3 () లో ఇలా పుస్తకానికి జతపర్చాలి.

14.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుప . G.O.Ms.No. 132 Fin, Dt: 6.7.2016 ప్రకారం చైల్డ్ కేర్ లీపు వర్తించే నియమాలన్నీ GO.Ms. No.33 Fin, Dt: 8.3.2016 కి అన్వయించు కొని 180 రోజుల సెలవులు వినియోగించుకోవాలి.

సందేహాలు  - సమాధానాలు

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ ఒక స్పెల్క మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా?

 సమాధానము:- G.O.Ms.No. 132 Fin, తేదీ: 06.07.2016 ప్రకారం వివాహ మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్కు మాగ్జిమం 20 రోజుల చొప్పున 3 స్పెల్లకు తగ్గకుండా 60 రోజులు వాడుకో వచ్చును. జీవోలో స్పెల్లకు తగ్గకుండా అన్నారు. కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ ముందుగానే మంజూరు చేయించు కోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?

సమాధానము:- చైల్టికేర్ లీవు DDOతో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి. ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసిన బాధ్యత DDO ది. 

సందేహము - చైల్డ్ కేర్ లీవ్ పెట్టిన నెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?

సమాధానము:- వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు. కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటి నుండి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు.

సందేహము:- మెటర్నిటీ లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు| పెట్టుకోవచ్చునా?

సమాధానము:- చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా other than casual casual leaveతో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.132 లోని రూలు 3 (h) సూచిస్తోంది.శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు. కేవలం 

సందేహము:- సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్కు అర్హులేనా?

సమాధానము:- అర్హులే, 60 రోజుల సెలవు వాడుకొనవచ్చును. 

సందేహము భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయవచ్చునా?

సమాధానము:- చేయవచ్చు. ఇందుకు సంబంధించిన G.O. 33 ప్రకారం సింగిల్ మేల్ ఎంప్లాయికి అవకాశం ఉంది.

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?

సమాధానము:- అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు / కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

సందేహము:- పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?

Children needs like examinations, sickness etc. అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్కు ప్రిఫిక్స్, సఫిక్స్ వర్తిస్తాయా? సమాధానము:- వర్తిస్తాయి. ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.

Child Care Leave Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top