Mission Vatsalya Scheme Complete Details

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, కాకినాడ జిల్లా, కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం అర్హులైన వారి నుండి మిషన్ - - వాత్సల్య క్రింద స్పాన్సర్షిప్ పథకం కొరకు అప్లికేషన్లు- కోరుట - గురించి.


సూచిక : మెమో నెం. WDCO2-26033/52/2019, తేదీ. 11/03/2023 శ్రీయుత డైరెక్టర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, గుంటూరు

జిల్లాలోని అందరూ CDPO లకు తెలియజేయునది ఏమనగా పై సూచిక ప్రకారం 18 సంవత్సరముల లోపు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లల కుటుంబాలు పిల్లలకు ఆర్ధిక లేదా ఇతరత్రా అనగా పిల్లల వైద్య, విద్య మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి అనుబంధ మద్దతును అందించడం కోసం కేంద్ర ప్రాయోజిత పదకం అయినటువంటి మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్షిప్ ఇది షరతులతో కూడిన సహాయంగా అందించడం జరుగుతుంది. ఈ sponsorship ద్వారా పిల్లలకి నెలకు ఒక్కొకరికి రూ.4000/- లు అందించడం జరుగుతుంది. 

ఈ sponsorship పొందుటకు పిల్లలకు కావలసిన అర్హతలు :-

1. తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.

2.పిల్లలు అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తువున్న వారు. 

3.తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురైన వారు. 

4.తల్లిదండ్రులు ఆర్ధికంగా మరియు శారీరకంగా అసమర్ధులు అయివుండి పిల్లలను చూసుకోలేని వారు.

5. JJ Act, 2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు అనగా, కుటుంబంతో లేని పిల్లలు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, బాల కార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, మిస్సింగ్ మరియు ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు లేదా వీధులలో నివసిస్తు న్నటువంటి పిల్లలు, సహాయం మరియు పునరావాసం అవసరమయ్యే హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన లేదా దోపిడీకి గురైన పిల్లలు.

6. PM Cares for Children Scheme (కోవిడ్-19/కరొనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు) నందు నమోదు కాబడిన పిల్లలు.

ఉండవలసిన ఆర్థిక ప్రమాణాలు :-

a.గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72,000/-లు కి మించరాదు.

b. అర్బన్ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆధాయం రూ.96,000/- లు కి మించరాదు.

Sponsorship యొక్క కాల పరిమితి :-

జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా చిల్డ్రన్స్ కోర్ట్ లిఖితపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల ఆధారంగా స్పాన్సర్సీపీను 18 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. స్పాన్సర్షిప్ మద్దతు వ్యవధి మిషన్ వాత్సల్య కాలంతో సహ-టెర్మినస్ గా ఉంటుంది.

  • ఏ సమయంలోనైనా పిల్లవాడిని హాస్టలో కానీ, ఏదైనా బాలసదనంలో కానీ చేర్పించిన యెడల స్పాన్సర్షిప్ సహాయం నిలిపివేయబడుతుంది.
  • ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విషయంలో మినహా పాఠశాలకు వెళ్లే పిల్లవాడు పాఠశాల హాజరులో 30 రోజులకు పైగా సక్రమంగా లేరని తేలితే, స్పాన్సర్షిప్ సహాయం సమీక్షించబడుతుంది మరియు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

కావున జిల్లాలోని అందరూ CDPO లకు తెలియజేయునది ఏమనగా మీ యొక్క ప్రాజెక్టు పరిధిలో అర్హత కలిగిన పిల్లలు వున్న యెడల సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ పరిధిలోని మహిళా పోలీసు మరియు అంగన్వాడీ కార్యకర్త ద్వారా దరఖాస్తులు సేకరించి తదుపరి సంభంధిత సూపర్వైజరు మరియు CDPO ల దృవీకరణతో ఏప్రియల్ – 5 వ తారీకు లోపు సాప్ట్ కాపీ లిస్టు తో కలిపి జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) - కార్యాలయానికి అందించవలసినదిగా ఆదేశించడం అయినది.

Download Proceeding Copy

Mission Vatsalya Scheme Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top