ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల) లో 2023-24 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC /Bi.PC/MEC /CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉందును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
ప్రవేశ అర్హతలు:
1. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు http://apms.ap.gov.in/apms/ చూడగలరు.
2. దరఖాస్తు చేయు విధానము: అభ్యర్థులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ. 22.05.2023 నుండి 07.06,2023 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెలించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్ http://apms.ap.gov.in/apms/ (online) లో దరఖాస్తు చేసుకొనవలయును,
3. దరఖాస్తు చేయడానికి రుసుము: OC, BC మరియు EWS లకు రూ.200/- (అక్షరములా రెండు వందల రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.150/- (అక్షరములా నూట యాభై రూపాయలు మాత్రమే)
4. ప్రవేశములు 10 వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
Download Complete Notification
0 comments:
Post a Comment