We Love Reading Today 28.05.24 Activities
ఒక రోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. 'కర్రపుల్లలతో చేసి ఉంది అదా..." అంది తాబేలు. 'అవును అదే. నేనే కష్టపడి కట్టుకు న్నాను' అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే... అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. 'ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటామా అందులో ఎలా ఉంటావో ఏమో... నేనైతే ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బందీ ఉండదు' అంది గొప్పలు పోతూ. దానికి పక్షి 'ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్క దానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నేనూ నా భార్యా పిల్లలూ అందరం కలిసుండగలం. అందుకే నాకు మా ఇల్లే ఇష్టం' అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడ్డం. గొప్పలు పోవడంలాంటివి చేయలేదు.
1,2 Classes Telugu
1,2 Classes English
1,2, Classes Maths
3,4,5 Classes Telugu
3,4,5 Classes English
3,4,5 Classes Maths








Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment