Day 29 We Love Reading Today 29.05.23 Activities
మొదటికే మోసం
ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేక పోయేవి. ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజులపాటు తినడానికి ఏమి దొరకలేదు. ఆకలితో కనకలాడి పోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం... 'మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచీ దాడి చేద్దాం' అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం... 'కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను' అంది. దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో 'అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడాం. కలిసే తిందాం' అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటామాటా పెరిగింది. 'అసలు నీకు వాటానే ఇవ్వను. మొత్తం నేనే తింటా పో' అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆపైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడీ పడీ సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది! 'అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే' అని బాధపడ్డాయి సింహం, చిరుతపులులు.
1,2 Classes Telugu
1,2 Classes English
1,2 Classes Mathematics
3,4,5 Classes Telugu
3,4,5 Classes English
3,4,5 Classes Mathematics
0 comments:
Post a Comment