IBPS: బ్యాంక్ ఉద్యోగం మీ లక్ష్యమా..? ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షల వివరాలు మీకోసం..

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. బ్యాంకింగ్ సెక్టార్‌లో పరిచయం అవసరం లేని సంస్థ. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది.



అటానమస్ బాడీగా వివిధ బ్యాంకుల్లో ఖాళీలకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అవసరమైతే పరీక్షల్లో సంస్కరణలను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు ఐబీపీఎస్‌ పరీక్షల గురించి తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే.. 

* ప్రారంభం ఎప్పుడు?

ఐబీపీఎస్‌ను 1984లో స్థాపించారు. అప్పట్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (NIBM) ఆధ్వర్యంలో ప్రైమరీ ఎగ్జామినేషన్ బాడీగా సేవలందించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది పలికింది. బ్యాంకు పరీక్షల్లో స్టాండర్డ్, సమర్థవంతమైన విధానాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో వివిధ ఉద్యోగాలకు తగ్గట్టు పరీక్షల్లో సమూలంగా మార్పులు చేసింది. 


ముఖ్యమైన పరీక్షలు


ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఈ లిస్ట్‌లో IBPS క్లర్క్, IBPS RRB (రీజినల్ రూరల్ బ్యాంక్), IBPS PO (ప్రొబెషనరీ ఆఫీసర్), IBPS SO (స్పెషలిస్ట్ ఆఫీసర్) వంటి పరీక్షలు ప్రధానమైనవి. ఈ పరీక్షల ద్వారా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీలు (MT)గా ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 


బ్యాంకింగ్ సెక్టార్‌లో ఐబీపీఎస్ పీఓ (IBPS PO) పరీక్షకు ఎక్కువ డిమాండ్ ఉంది. బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన కెరీర్ అవకాశాలను ఇది అందిస్తుంది. 


గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలకు గ్రూప్-A ఆఫీసర్స్ (స్కేల్-I, II & III), గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను IBPS RRB పరీక్ష ద్వారా చేపడతారు.రీజనల్ రూరల్ బ్యాంకింగ్‌లో ఈ జాబ్ రోల్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించడమే అంతిమ లక్ష్యం. ఐబీపీఎస్ SO (స్పెషలిస్ట్ ఆఫీసర్స్) ఎగ్జామ్ ద్వారా IT ఆఫీసర్ (స్కేల్-I), అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I), రాజభాష అధికారి (స్కేల్ I), లా ఆఫీసర్ (స్కేల్ I), HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I), మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్ I) వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తారు. 


* ఏటా క్లర్క్ పరీక్ష


ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దేశంలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్ట్‌లను ఈ పరీక్ష ద్వారా ఐబీపీఎస్ భర్తీ చేస్తుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆమోదించిన కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)ను అనురించి ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. 2023-24 క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.కాగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), ఆర్థిక మంత్రిత్వ శాఖ నామినీ బోర్డు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే(IIT Bomby), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (NIBM), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) వంటి అత్యుత్తమ సంస్థల ఆధ్వర్యంలో ఐబీపీఎస్ పనిచేస్తోంది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top