NESTS: ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (ఈఎంఆర్ఎస్ డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెక్స్ట్) దరఖాస్తులు ఆహ్వానించింది. 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని నెక్స్ట్ తెలిపింది. 

ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ (మేల్), పీఈటీ (ఫిమేల్), లైబ్రేరియన్.

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు

మొత్తం ఖాళీలు: 6,329.

అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి..

వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ. 35400-112400; హాస్టల్ వార్డెన్క రూ.29200 -92300.

ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఓఎంఆర్ ఆధారిత(పెన్ పేపర్) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ:18.08.23

Read Also:

Ekalavya Residential Model Schools Principal, PGT and Non Teaching Posts Total 4062 Posts Recruitment Notification Last Date to Apply: 31.07.23 Click Here

Job Notification Whatsapp Group:


Download Complete Notification




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top