PM YASASVI Scheme 2023: విద్యార్థుల స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

PM Yashasvi Scholarship Scheme 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పాఠశాల విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు ప్రకటించింది. NTA వైబ్రంట్ ఇండియా (PM Young Achievers Scholarship Award Scheme - YASASVI) ప్రవేశ పరీక్ష 2023 కోసం ప్రధాన మంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న స్కూల్‌ విద్యార్థులు YASASVI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు


YASASVI స్కాలర్‌షిప్‌ పథకం అనేది ఇతర వెనుకబడిన తరగతి (OBC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), నాన్-షెడ్యూల్డ్, ఖనబ్డోస్ , సెమీ- నోమాడిక్ ట్రైబ్స్ (DNT/SNT) వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. 9వ తరగతి లేదా 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ స్కీం ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికైన వారికి ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1, 25,000 వరకు ఉంటుంది.

YASASVI స్కీమ్‌ ఎంపిక ప్రక్రియ ఇలా:

NTA YASASVI 2022 కోసం విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి.. సెప్టెంబర్ 11న MCQ ఫార్మాట్‌లో ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ 10.08.23 నుండి ప్రారంభమైంది. విద్యార్థులు ఆగస్టు 17 రాత్రి 11:50 వరకు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

PM YASASVI స్కీమ్ దరఖాస్తు విధానం:

మొదట విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్వె ఓపెన్‌ చేయాలి

వెబ్‌సైట్‌లో అందించిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయాలి

అనంతరం పేరు, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ని సమర్పించి అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి

ఇప్పుడు లాగిన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని సమర్పించి లాగిన్ చేయాలి

అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి.. ప్రింట్‌ తీసుకోవాలి

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభతేది: 10.08.23

దరఖాస్తులకు చివరితేది: 17-08-2023

పరీక్ష తేది: 29.09-2023

Download Notification

Apply Here: Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top