Promotion Pay Fixation ప్రమోషన్ పొందిన సందర్భములో వేతన స్థిరీకరణ ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత

 ప్రమోషన్ పొందిన సందర్భములో వేతన స్థిరీకరణ ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత

25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టునందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998, పిఆర్సి స్కేళ్ళలో 8సం॥ స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఎఫ్ ఆర్ 22ఎ (1) ప్రకారం వేతన స్థీరికరణ చేయబడేది.

2005 పిఆర్సి సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28.09.2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010,2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ, 6/12/18/ స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఎఫ్ ఆర్ 220 ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది. ఇదే విధానం 2022 వేతన స్కేళ్ళలో కూడా కొనసాగుతుంది.

దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క

స్కేలులోని తదుపరి స్టేజివద్ద వేతన స్థిరీకరణ చేయబడుతుంది.

ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

1. వాస్తవ ప్రమోషన్ తేదీ నాడు గాని లేదా

2. క్రిందిపోస్టులోని తదుపరి ఇంక్రిమెంట్ తేదీనాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును. జివో ఎంఎస్ నెం.145, ఆర్థిక, తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో పైరెండింటిలో దేని ప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసే బాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది,

ఉదాహరణ: అగష్టు నెల ఇంక్రిమెంట్ తేదీగా గల ఎం.రత్న కమల్ బాబు అనే ఉపాధ్యాయుడు తేదీ 11.06.2023న స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందినారు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ. 44570 -127480 స్కేలులో రూ. 69020/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 220 ప్రకారం రెండువిధాలుగా స్థిరీకరించవచ్చు.

ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:

1. తేదీ 11.06,2023 నాటికి ఎటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు : రూ. 69,020/- స్కేలు 44570 - 127480

2. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒకనోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు

3. స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం

4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ

క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ

: రూ.70,850/- స్కేలు 44570 - 127480 :.72,810/- 44570-127480 01-06-2024 ఎస్పి మనోహర్ కుమార్

1. తేదీ 11.06,2023 నాటికి ఎటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు : రూ. 69,020/- స్కేలు 44570 - 127480

2. పదోన్నతి పొందిన రోజు 11,06.2023 ఎస్ఆర్ఆ220 ప్రకారం వేతన నిర్ణయం రూ.70,850/- స్కేలు 44570 - 127480

3. తేదీ 1.08.2023 న ఎస్ జిటి పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు

4, ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(08/23) న : రూ.70,850/- స్కేలు 44570 127480 : రూ.72,810/- స్కేలు 44570 -127480

6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ

5. స్కూల్ అసిసెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజీలో వేతన నిర్ణయం (08/23)న : రూ.74,770/- స్కేలు 44570 - 127480 : 1.08.2024

పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అగష్టు నెల కొనసాగుతుంది.

24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఈ నిబంధన వర్తించదు. వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1) నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది

The above Information prepared by Sri SP MANOHAR, UTF St Secretary

Download Copy 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top