APOSS ఓపెన్ స్కూల్ 10, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి పదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపనున్నట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలియజేసింది. పూర్తి వివరాలకు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించవచ్చు.

వయసు: ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపుతారు.

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్ఎస్ఈసీ, సీఈసీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ మధ్యలోనే మానేసిన అభ్యర్థులూ అర్హులే. వయసు: ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 15 ఏళ్లు నిండి ఉండాలి.

గరిష్ఠ పరిమితి లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25/09/2023. వెబ్సైట్: https://apopenschool.ap.gov.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top