NCL Recruitment 2023: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1140 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
NCL Recruitment 2023: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) 1140 అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్ సీ ఎల్ అధికారిక వెబ్‌సైట్ nclcil.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 15
వేకెన్సీ వివరాలు..
మొత్తం 1140 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 26 సంవత్సరాలు ఉండాలి. 18 ఏళ్ల లోపు వారు, 28 ఏళ్ల పైబడినవారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అనర్హులు. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికెట్ పొందిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు.
ఇలా అప్లై చేయండి..
ఎన్ సీ ఎల్ లో అప్రంటిస్ ట్రైనీ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఈ కింద స్టెప్స్ ఫాలో కావాలి.
ముందుగా ఎన్ సీ ఎల్ అధికారిక వెబ్‌సైట్ nclcil.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో, రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
తరువాత, అప్రెంటిస్ శిక్షణపై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫామ్‌ను ఫిల్ చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.
Download Complete Notification


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment