ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి ఉపకార వేతన పథకం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీ(జియాలజీ/ జియో ఫిజిక్స్) కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు ఈ స్కీము ఉద్దేశించారు.
మొత్తం ఎంతమందికి స్కాలర్షిప్ ఇస్తారు?
మొత్తం రెండు వేల స్కాలర్షిప్లు కేటాయించారు. అర్హులైన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనం అందిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సహాయం ఎంత?
ఎంపికైనవారికి ఏడాదికి రూ.48,000 చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు ఉపకారవేతనం అందిస్తారు
వివరాలు...
ఎవరికోసం: భారతదేశంలో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.: విద్యాసంస్థలో ఫుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ.. వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు. చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. వయసు 16-10-2023 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
ఎంపిక: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదుచేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:30.11.23
Job Notification Whatsapp Channel:
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notification Telegram Channel:
0 comments:
Post a Comment