Scholarship Guide: పీజీ కోర్సుల్లో జాయిన్ అవుతున్నారా? అందుబాటులో ఉన్న టాప్‌ స్కాలర్‌షిప్స్ ఇవే

బారతదేశంలో ఉన్నత విద్య చదివే వారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఆర్థిక పరిస్థితులని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చాలా మంది విద్యార్థులు పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోసం చేసిన పెట్టుబడిపై రాబడిని పొందడం కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే అందించే జీతాలు కోర్సు ఫీజుకు సమీపంలో కూడా ఉండటం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020-21 విద్యా సంవత్సరంలో 4.14 కోట్ల మంది విద్యార్థులు విద్యాసంస్థలలో చేరారు. వీరిలో 79.06% మంది అండర్ గ్రాడ్యుయేట్లు కాగా, 11.5% మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరారని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) రిపోర్ట్ పేర్కొంది.

అయితే ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సహాయపడతాయి. న్యూస్‌18 ‘స్కాలర్‌షిప్ గైడ్’లో భాగంగా భారతదేశంలో PG కోర్సులు చదువుకునేందుకు అందించే టాప్ స్కాలర్‌షిప్‌లు ఏవో తెలుసుకుందాం.

సెంట్రల్ స్కాలర్‌షిప్‌లు:

1. AICTE PG స్కాలర్‌షిప్

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భారతదేశంలోని విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు మద్దతుగా స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. M.E./M.Tech/M.Arch./M.Des కోర్సులలో AICTE ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సంవత్సరం చేరుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు CAT, CEED లేదా ఇతర సంబంధిత ప్రవేశ పరీక్షలలో పొందిన స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అవుతారు. విద్యార్థుల ప్రొఫైల్‌లు షార్ట్‌లిస్ట్ చేసి AICTEకి పంపుతారు. సంబంధిత సంస్థలు పర్సనల్ డీటైల్స్‌, అడ్మిషన్ తేదీ, ఇతర వివరాలను వెరిఫై చేస్తాయి. ఈ లింక్‌ https://pgscholarship.aicte-india.org/లో అప్లై చేసుకోవచ్చు.

2. సింగిల్‌ గర్ల్‌ ఛైల్డ్‌ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్

నాన్-ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చదవాలనుకునే బాలికలకు ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. ప్రతి సంవత్సరం 1,200 మందికి అందుబాటులో ఉంటుంది. రెండు సంవత్సరాల కోర్సుకు విద్యార్థులకు నెలకు రూ.2,000 లభిస్తుంది. 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న, నాన్-ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం పొందిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు అయి ఉండాలి, తోబుట్టువులెవరూ ఉండరు

బాలికలు సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు అందజేసి స్కాలర్‌షిప్ పొందవచ్చు. వీటిని అధికారులు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ugc.gov.inలో అప్లై చేసుకోవచ్చు.

మైనారిటీ విద్యార్థులకు..

ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధులు, క్రిస్టియన్‌ల సహా మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ సహా అనేక ఇతర కేంద్ర ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజినీరింగ్, టెక్నాలజీలో ఎంఫిల్/పీహెచ్‌డీ డిగ్రీల సహా అన్ని సబ్జెక్టులకు ప్రతి సంవత్సరం 756 స్లాట్‌లను అందిస్తుంది. మొత్తంగా 3% ఫెలోషిప్‌లు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన దివ్యాంగులకు రిజర్వ్ చేశారు.

ప్రైవేట్ సపోర్ట్ గ్రూప్స్

భారతీయ విద్యార్థులకు అనేక ప్రభుత్వేతర స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్లు, ఫౌండేషన్లు, హెల్ప్‌ గ్రూప్స్‌ ఉన్నాయి. వీటిలో చాలా వరకు మినహాయింపులు ఉన్నాయి, విద్యార్థుల 100% ఫీజులను కవర్ చేయగలవు. చాలా మంది కోర్సు తర్వాత ఇంటర్న్‌షిప్ అవకాశాలు లేదా మార్గదర్శకత్వం కూడా అందిస్తారు.

1. రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌

రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు సపోర్ట్‌ చేస్తుంది. ఇది రూ.6 లక్షల వరకు 100 స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. వీటిలో 80% నిధులు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో, ట్యూషన్, డైరెక్ట్ అకడమిక్ ఖర్చుల కోసం ముందుగానే మంజూరు చేస్తుంది. కాన్ఫరెన్స్ సంబంధిత ఖర్చుల సహా పరోక్ష విద్యా, వ్యక్తిగత అభివృద్ధి ఖర్చుల సహా వృత్తిపరమైన అభివృద్ధికి సపోర్ట్‌ చేయడానికి మిగిలిన 20% నిధులు మంజూరు చేస్తుంది.

స్వదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు గేట్ పరీక్షలో 550- 1,000 స్కోర్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు మల్టిపుల్‌- లేయర్డ్ ప్రోగ్రామ్‌ను కలిగి ఉంటారు. ముందుగా ప్రొఫైల్‌లు షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత ఆప్టిట్యూడ్ ఎగ్జామ్‌ ఉంటుంది. దరఖాస్తులో భాగంగా, అభ్యర్థులు డాక్యుమెంట్లు, రిఫరెన్స్‌ లెటర్లు, ఎస్సేలు, స్టేట్‌మెంట్స్‌ ఆఫ్‌ పర్పస్‌ సమర్పించాలి. ఆప్టిట్యూడ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. https://scholarships.reliancefoundation.org/PG_Scholarship.aspx లింక్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

3. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్

భారతదేశంలో MBA చదవాలనుకునే విద్యార్థులకు IDFC బ్యాంక్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. విద్యార్థులు చదువుకు తోడ్పాటు నందించేందుకు రెండేళ్లపాటు రూ.2 లక్షలు అందజేస్తారు. ఒక సంవత్సరంలో 350 స్కాలర్‌షిప్‌లు ఆఫర్‌ చేస్తుంది. MBA చదవాలనుకునే భారతీయ విద్యార్థులు, సంవత్సరానికి రూ.6 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు ఫారమ్‌ను సమర్పించాలి, ఆన్-గ్రౌండ్ స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. https://www.idfcfirstbank.com/csr-activities/educational-itiives/mba-scholarship ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వేతర వర్గంలోని ఇతర ప్రసిద్ధ స్కాలర్‌షిప్‌లలో టాటా ట్రస్ట్ స్కాలర్‌షిప్, నరోతమ్ సెఖ్సరియా ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఉన్నాయి

రాష్ట్ర స్థాయి స్కాలర్‌షిప్‌లు:

1. రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ శిక్షన్ శుల్ఖ్ శిష్యవృత్తి స్కీమ్‌

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ట్యూషన్ ఫీజులో 50% అలాగే పరీక్ష ఫీజులో 50% అందిస్తుంది. దరఖాస్తుదారులు మహారాష్ట్రలో నివాసం ఉండాలి, ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులో చేరి ఉండాలి. అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఇది డిప్లొమాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్‌లకు వర్తిస్తుంది. దరఖాస్తుదారులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే నిర్వహిస్తారు. https://mahadbt.maharashtra.gov.in లో అప్లై చేసుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top