SHRESHTA: విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌.. కేంద్రం అదిరే స్కీమ్..

 అన్ని వర్గాలకు చదువుకునే అవకాశాలు లభించాలి, అప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే లక్ష్యంతో విద్యా రంగంలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాల (SC) విద్యను ప్రోత్సహించడం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం కోసం సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ శ్రేష్ట (SHRESHTA) అనే పథకాన్ని ప్రారంభించింది.

దూరదృష్టితో కూడిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిధిని విస్తరించడం, విద్యారంగంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవా లోపాలను సమర్థవంతంగా పరిష్కరించడం లక్ష్యంగా స్కీమ్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హై స్కూల్స్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్‌ (SHRESHTA)ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

* శ్రేష్ట పథకం ఎలా పని చేస్తుంది?

శ్రేష్ట స్కీమ్‌ ప్రాథమిక లక్ష్యం SC విద్యార్థులకు ఉన్నత-నాణ్యత విద్య, సమగ్ర అభివృద్ధి అవకాశాలను అందించడం, వారి భవిష్యత్తు అవకాశాలకు భరోసా ఇవ్వడం. ఈ పథకం రెండు విధానాలతో రూపొందింది. SC విద్యార్థులను శక్తివంతం చేయడం, విద్యా అంతరాన్ని(Educational Gap) తగ్గించడానికి ప్రయత్నిస్తుంది

ఇది కూడా చదవండి:  నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగ మేళా, 10 పాస్ అయినా చాలు, రూ.2.8 లక్షల వరకు జీతం!

* శ్రేష్ట స్కూల్స్‌

ఈ మోడ్ కింద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్‌ శ్రేష్ట(NETS) ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ విద్యార్ధులు CBSE/స్టేట్ బోర్డ్‌లతో అఫిలియేట్‌ అయిన ఉత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9వ, 11వ తరగతులలో ప్రవేశం పొందుతారు. ఆ పాఠశాలల్లో 12వ తరగతి వరకు చదువుకోగలుగుతారు.

గత మూడు సంవత్సరాలుగా 75% కంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతంతో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న CBSE బేస్డ్ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలను గుర్తించే సెలక్షన్‌ ప్రాసెస్‌ని మెటిక్యులస్‌గా రూపొందించారు. ఏటా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉన్న సుమారు 3000 మంది SC విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ విద్యా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఈ పథకం పాఠశాల ఫీజులు (ట్యూషన్ ఫీజులు), హాస్టల్ ఫీజులు (మెస్ ఛార్జీలు) కలిపి కవర్ చేస్తుంది. ఈ ఫీజులు 9వ తరగతికి రూ. 1,00,000, 10వ తరగతికి రూ. 1,10,000, 11వ తరగతికి రూ. 1,25,000, 12వ తరగతికి రూ. 1,35,000గా ఉంటాయి. ఈ పథకం ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఒక బ్రిడ్జ్ కోర్సు ఉంటుంది, విద్యార్థుల వ్యక్తిగత విద్యా అవసరాలను తీర్చడం, పాఠశాల వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడుతుంది. వార్షిక రుసుములో 10%కి సమానమైన ఈ బ్రిడ్జ్ కోర్సు ఖర్చు కూడా డిపార్ట్‌మెంట్ ద్వారా కవర్ అవుతుంది. ఈ విద్యార్థుల పురోగతిని మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తుంది.

* NGO/VO పాఠశాలలు/హాస్టల్‌లు

ప్రత్యేకంగా 12వ తరగతి వరకు విద్యను అందించే స్వచ్ఛంద సంస్థలు(VO), NGOలు నిర్వహించబడే పాఠశాలలు, హాస్టల్‌ల కోసం ఈ స్కీమ్‌ రూపొందించారు. గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందే, స్థిరంగా సంతృప్తికరమైన పనితీరును ప్రదర్శించే పాఠశాలలు, హాస్టళ్లు ఈ ఇనిషియేటివ్‌ ద్వారా సపోర్ట్‌ని అందుకుంటాయి.

ఈ పాఠశాలల్లో చేరిన ఎస్సీ విద్యార్థులకు పాఠశాల ఫీజులు, రెసిడెన్షియల్ ఛార్జీలను కవర్ చేయడానికి గ్రాంట్లు కేటాయిస్తారు. వర్తించే మార్గదర్శకాల ఆధారంగా SC విద్యార్థికి గ్రాంట్ నిర్ణయిస్తారు.

* ఎస్సీ విద్యార్థుల సాధికారత

ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి అవకాశాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను శ్రేష్ట పథకం చూపుతుంది. సేవా అంతరాలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా, విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, ఈ పథకం ఎస్సీ విద్యార్థులను బలోపేతం చేస్తుంది. వారి సామాజిక-ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top