ఏపీ ప్రభుత్వం.. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లాలోని కోయిలకుంట్ల మండలంలో గల S.V.B.C గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను (Job Mela) ఏర్పాటు చేసారు.ఈనెల 21వ తేదీన నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో నాలుగు ప్రముఖ కంపెనీలు తమ సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని ఎస్పీ, బీసీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment