కరెన్సీ ప్రెస్ లో ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

మహారాష్ట్ర నాసిక్ లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (కరెన్సీ నోట్ ప్రెస్)... సూపర్ వైజర్, ఆర్టిస్ట్ సెక్రటేరియట్ అసిస్టెంట్.. మొదలైన 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్పులతో నియామకాలు చేపడతారు.

మొత్తం 117 పోస్టుల్లో.. 1) సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేషన్-ప్రింటింగ్) - 02, 2) సూపర్వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 01, 3) ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైనర్) -01, 4) సెక్రటేరియట్ అసిస్టెంట్-01, 5) జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్/ కంట్రోల్) -112 ఉన్నాయి.

1) సూపర్వైజర్ (టెక్నికల్ ఆపరేషన్-ప్రింటింగ్): ఇంజినీరింగ్ (ప్రింటింగ్) డిప్లొమా మొదటిశ్రేణిలో

ఉత్తీర్ణత సాధించాలి. లేదా బీటెక్/బీఈ / బీఎస్సీ ఇంజినీరింగ్ (ప్రింటింగ్) పాసవ్వాలి. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2) సూపర్వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్): హిందీ లేదా ఇంగ్లిష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసవ్వాలి. డిగ్రీ

| స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టుగా చదివుండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్ లోకి, ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించడంలో ఏడాది అనుభవం ఉండాలి. సంస్కృత భాషా పరిజ్ఞానం లేదా ఏదైనా ఇతర భాష తెలిసి ఉండాలి. హిందీలో కంప్యూటర్పైన పనిచేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

3) ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్): ఫైనార్ట్స్/ విజువల్ ఆర్ట్స్ / ఒకేషనల్ (గ్రాఫిక్స్) డిగ్రీ పాసవ్వాలి. గ్రాఫిక్ డిజైన్/ కమర్షియల్ ఆర్ట్స్లో 55 శాతం మార్కులు పొందాలి.

4) సెక్రటేరియట్ అసిస్టెంట్: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీ పాసవ్వాలి..

ఇంగ్లిష్/హిందీ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సెక్రటేరియల్ జాబ్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్షతోపాటు స్టెనోగ్రఫీ, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.

5) జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్/ కంట్రోల్): సంబంధిత ట్రేడ్ ఎన్సీవీటీ/ ఎస్సీవీటి నుంచి పుల్టైమ్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్షల తేదీ, ఇతర వివరాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్సైట్ను చూస్తుండాలి.

> ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలనే దరఖాస్తులో రాయాలి.

> చివరితేదీ అయిన 18.11.2023 నాటికి తగిన విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.

> ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.11.2023

> ఆన్లైన్ పరీక్ష: జనవరి / ఫిబ్రవరి 2024



Job Notification Whatsapp Group:


Job Notification Telegram Group:


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top