ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్​ కనిపెట్టేయొచ్చు! గూగుల్ కాంటాక్ట్స్​ నయా ఫీచర్​!

ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ గుడ్ న్యూస్​. Google Contacts App యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా, అతని కరెంట్ లొకేషన్​ను ట్రాక్​ చేసే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.



మరి ఈ ఫీచర్​ను ఎలా ఉపయోగించాలి? దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Google Contacts App Latest Feature : మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్​కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక, చాలా కంగారు పడిపోతూ ఉంటాం.

కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్​ రూమ్​కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'గూగుల్ కాంటాక్ట్స్​ యాప్'​ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్​ కరెంట్​ లొకేషన్​ను ఈ ఫీచర్​ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్​ ఎనేబుల్ చేసుకోండిలా!

How To Enable Google Contacts Live Tracker Feature : గూగుల్​ కాంటాక్ట్స్ యాప్​ 4.22.37.586680692 వెర్షన్​ను అప్​డేట్​ చేసుకున్న ఆండ్రాయిడ్​ యూజర్లకు ఈ నయా ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే?

ముందుగా మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లోని Settings ఓపెన్ చేయాలి.

Apps సెక్షన్​లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి.

వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే గూగుల్ కాంటాక్ట్స్ యాప్​ వెర్షన్ నంబర్​ కనిపిస్తుంది.

లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్​ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్​ను అప్​డేట్​ చేసుకోండి. అంతే సింపుల్​!

నోట్​ : ఒక వేళ యాప్​ అప్​డేట్ చేసినా 4.22.37.586680692 వెర్షన్​ రాకపోతే, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వెర్షన్​ ఒక క్రమ పద్ధతిలో రోల్​అవుట్ అవుతోంది. కనుక త్వరలోనే మీకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. మీ ఫోన్​లో కనుక గూగుల్ కాంటాక్ట్స్ యాప్​ లేనట్లయితే.. గూగుల్ ప్లే స్టోర్​కు వెళ్లి, లేటెస్ట్ వెర్షన్​ను డౌన్​లోడే చేసుకోవచ్చు.

ఎవరి లొకేషన్ ట్రేస్ చేయవచ్చు?

ఈ నయా ఫీచర్​తో మీ జీ-మెయిల్​లో, ఫోన్​ కాంటాక్ట్​ లిస్ట్​లో ఉన్నవారి కరెంట్​ లొకేషన్​ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు ఎవరైతో తమ లొకేషన్​ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్​ చేశారో, వారి కరెంట్ లొకేషన్​ను కూడా మీరు ట్రాక్ చేయగలుగుతారు.

లైవ్​ లొకేషన్​ను ఎలా ట్రాక్ చేయాలంటే?

How To Track Live Location With Google Contacts :

ముందుగా మీరు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి.

మీరు ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్​ను ట్యాప్ చేయాలి.

వెంటనే మీకు యూజర్ ఫొటో, అతని కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి.

అక్కడే Google Maps. Location Sharing ఆప్షన్​ కూడా కనిపిస్తుంది.

ఈ గూగుల్ మ్యాప్స్​ లింక్​ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్​ ఉన్న కరెంట్ లొకేషన్​ మీకు కనబడుతుంది.

మనం సదరు యూజర్​ ఉన్న లొకేషన్​కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్​ను కూడా చూపిస్తుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top