హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2):1,100 పోస్టులు
ట్రేడుల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275, ఎలక్ట్రిషియన్- 275, 28- 550.
అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్ షిప్ పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.22,528.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 16/01/2024.
Download Complete Notification


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment