AP Anganwadi Jobs 2024 : ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే

 AP Anganwadi Recruitment 2024 Updates: విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఉండగా… 37 పోస్టులు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ICDS, విశాఖపట్నం జిల్లా.

ఉద్యోగాలు - అంగన్వాడీ పోస్టులు

మొత్తం ఖాళీలు -39 (అంగన్‌వాడీ వర్కర్ - 2 , అంగన్‌వాడీ హెల్పర్- 37 ఉద్యోగాలు)

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి పేరు - విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.

అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

వయోపరిమితి - 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500 ఇస్తారు. అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళలై ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

పంపాల్సి చిరునామా - విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ - 15-02-2024.(సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది)

గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.

మొత్తం 100 మార్కులకు గాను పారామీటర్స్ తీసుకుంటారు. ఇందులో పది ఉత్తీర్ణతకు 50 మార్కులు, ఇంటర్వూలకు 20 మార్కులు ఉంటాయి.

వివిధ రకాల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి....

Whatsapp Channel...


Telegram Channel...


Download Complete Notification & Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top