NDA Recruitment : పుణె ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ మొత్తం 198 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్, కుక్(COOK), టీఏ- సైకిల్ రిపేరర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్(STENORAPER), డ్రాఫ్ట్స్‌మ్యాన్(DRAFTSMAN) తదితర గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ(ITI), సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : ndacivrect.gov.in ని సందర్శించలరు.
Download Complete Notification


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment