నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్

 తెలంగాణ ప్రభుత్వం(TS Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని(TS Medical Helath Department Jobs) 5,348 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది.

మార్చిన 16వ తేదీనే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్, అర్హతకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు.

పోస్టుల వివరాలు ఇలా

హెచ్ ఆఫ్ డిపార్ట్మెంట్ -3235

వైద్య విధాన పరిషత్ -1255

పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్- 575

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్- 11

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ -34 పోస్టులు

రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ పోస్టుల భర్తీకి ఇంకా అధికారిక నోటిఫికేషన్(Jobs Notification) రావాల్సి ఉంది.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top