ఏపీలో ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వస్తేనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తే డీఎస్సీకి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టత వస్తేనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment