పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారితో జరిగిన సమావేశ వివరాలు..
1) 2024 డిఎస్సీ నందు మరలా ప్రవేశపెడుతున్న అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కోరగా ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు.
2) ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై గతంలో నియమించిన కమిటీతో ఒక వారం రోజుల్లో నివేదిక తెప్పించుకొని నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.
3) జీవో 117ను రద్దు చేయాలని కోరగా, జీవో లో ఉన్న ఇబ్బందికర అంశాల్ని సవరించడానికి సానుకూలత తెలిపారు.
4) సీనియర్ డైట్ లెక్చరర్ పదోన్నతులకు ఎంఈఓ/ హెచ్ఎం/ జూనియర్ డైట్ లెక్చరర్ల కామన్ సీనియారిటీతో పదోన్నతులు చేపట్టాలని కోరగా న్యాయమైన డిమాండ్ అని సానుకూలత ప్రకటించారు.
5) అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జె.ఎల్ పదోన్నతులు కల్పించాలని కోరగా, న్యాయమైన డిమాండ్ అని, ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించుటకు ప్రయత్నిస్తామన్నారు.
6) ప్లస్ టు పాఠశాలల్లో పదోన్నతులు పొందిన వారికి, ప్రధానోపాధ్యాయులకు ఎఫ్.ఆర్ 22(బి) ప్రకారం వేతన స్థిరీకరణకు అనుమతించాలని కోరగా, ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోందని, న్యాయమైన డిమాండ్ కనుక సానుకూల నిర్ణయానికి ప్రయత్నిస్తానన్నారు.
7) ఆగిపోయిన, కోర్టులో ఉన్న పండిత పదోన్నతులను చేపట్టుటపై పరిశీలిస్తానన్నారు.
8) పురపాలక ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులకు ఒకే విద్యార్హతలు ఉండేలా, పదోన్నతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
9) జీవో 117 లో 92,138 లోపు విద్యార్థులు గల ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం, ఎస్.ఏ(పి.ఇ) పోస్టుల కొనసాగింపుపై సానుకూలత వ్యక్తం చేసి వివరాలు పరిశీలిస్తానన్నారు.
10) 20 లోపు విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు లేదా ఒక ఉపాధ్యాయుడు, ఒక వాలంటీర్నైనా అనుమతించాలని కోరగా ఆర్థిక పరిస్థితితో ముడిపడిన అంశమన్నారు.
11) ఎంఇఓ 1,2 లకు సమాన అధికారాలు కల్పించాలని కోరగా న్యాయమైన అంశం కనుక మంత్రిగారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
12) మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరగా, ఉన్న పాఠశాలల్లో అధిక విద్యార్థులు ఉండటం వలన పరిపాలన కష్టమవుతుందని, వచ్చే విద్యా సంవత్సరంలో నూతన పాఠశాలలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు.
13) ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నందున డైట్లలో డైట్ లలో పూర్వ ప్రాథమిక శిక్షణ వింగ్ ఏర్పాటు చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు.
14) ముఖ్య కార్యదర్శి గారు జిల్లాల పర్యటనలో భయపెట్టే వాతావరణం తొలగించాలని, ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే సానుకూలంగా తెలియజేయాలని కోరడం జరిగింది. ఎవర్ని ఇబ్బంది పెట్టనని, ఇంతవరకు ఎవరిపై చర్యలు చేపట్టలేదని తెలిపారు.
15) నియామక విధానంలో పొరపాటు వలన నష్టపోయిన 2008 డీఎస్సీ ఎం టి ఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని కోరడం జరిగింది. కొన్ని జిల్లాలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయాలని కోరడం జరిగింది.
16) 1998 డీఎస్సీ ఎం టి ఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు అమలు చేయాలని కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఉందన్నారు.
17)పిఇటి పోస్టులు ఉన్నతీకరించిన నేపథ్యంలో విద్యార్హత లేక పిఇటిలుగా కొనసాగుతున్న ఉపాధ్యాయులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది.ఇన్ సర్వీస్ బిపిఇడి చేయుటకు యూనివర్సిటీలకు లేఖ వ్రాస్తామన్నారు.
18) పురపాలక ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యంపై సానుకూల నిర్ణయాన్ని వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
19) పురపాలక ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న ఎస్.జి.టి తత్సమాన పోస్టులను ఉన్నతీకరించాలని కోరడం జరిగింది.
20) ఎయిడెడ్ ఉపాధ్యాయుల వలె ఎయిడెడ్ బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయుటకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.
22) వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వెంటనే ఒంటిపూట బడులు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
23) సిఎస్సి మంజూరు ఉత్తర్వులు లేవని ట్రెజరీలలో ఆపుతున్న మెడికల్ రీయంబర్స్మెంట్, గుర్తింపు పొందని ఆసుపత్రులలో చేయించుకున్న చికిత్సకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యాన్ని అనుమతించాలని కోరడం జరిగింది.
24) అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరడం జరిగింది.
25) ఆదర్శ పాఠశాలలను పాఠశాల విద్యలో విలీనం చేయాలని కోరగా, ఆదర్శ పాఠశాలల్లో మంచి నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రశంసించారు. సమస్యను చర్చిద్దాం అన్నారు.
26) స్థానిక సంస్థల ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాల జాప్యంపై మంచి నిర్ణయం తీసుకోవాలని, జిల్లా యూనిట్ గా కారుణ్య నియామకాలకు అనుమతించాలని కోరడం జరిగింది.
27) 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలకు 660 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు పై సానుకూల నిర్ణయాన్ని కోరడం జరిగింది.
28) స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య) పదోన్నతులకు డి రిజర్వేషన్ అమలు చేసి భర్తీ చేయాలని కోరడం జరిగింది.
29) ఉపాధ్యాయులు ప్రశాంతంగా బోధన చేసుకునే అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.
30) విద్యార్థులకు ఎఫ్.ఏ,ఎస్.ఏ పరీక్షల ప్రశ్నాపత్రాలు డీసీఇబీ ద్వారా సరఫరా చేయాలని కోరడం జరిగింది.
31)నేరుగా, పదోన్నతి ద్వారా నియమింపబడిన జె.ఎల్ లకు కామన్ సీనియారిటీ ద్వారా ప్రిన్సిపల్ పదోన్నతులు చేపట్టాలని కోరడం జరిగింది.
32) ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఇంకా పలు విద్యారంగ సమస్యలపై చర్చించడం జరిగింది.
0 comments:
Post a Comment