ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల పలితాలు విడుదలైనట్లు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు తెలిపారు. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏపీ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పదో తరగతిలో 18,185 మంది (55.81), ఇంటర్లో 48,377 మంది (65.77శాతం) ఉత్తీర్ణత సాధించారు.
0 comments:
Post a Comment