కేంద్ర ప్రభుత్వ సూపర్ ఇన్సూరెన్స్ - నెలకు రూ.36 చెల్లిస్తే రూ.2 లక్షల జీవిత బీమా - Best Life Insurance Plan

PM Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Scheme :ఎవరి ఇంట్లోనైనా కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ.. అదే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వ్యక్తి మరణిస్తే ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి టైమ్​లో.. జీవిత బీమా(Life Insurance) చాలా ఉపయోగపడుతుంది. అయితే.. చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఉన్నా.. ప్రీమియం ఎక్కువ ఉంటుందన్న కారణం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు.అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో కొన్ని బీమా పాలసీలను అందిస్తోంది. అలాంటి వాటిల్లో ఒకటి.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. ఈ స్కీమ్​ ద్వారా నెలకు రూ.36 చొప్పున చెల్లించి రూ.2లక్షలు బీమా సదుపాయం పొందొచ్చు. ఇంతకీ, ఈ పథకంలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు? కాల వ్యవధి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు అర్హులు.బ్యాంకు/ పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్ ఉన్నవారెవరైనా ఈ స్కీమ్​లో చేరవచ్చు.ఇందుకోసం బ్యాంకు అకౌంట్​ను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. కేవైసీ చేయించడం తప్పనిసరి అనే విషయాన్ని మీరు గమనించాలి.జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా PMJJBYలో చేరవచ్చు. అయితే, ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాలి.పాలసీదారుకు 55 ఏళ్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పొందేందుకు వీలుంటుంది. అంటే.. పాలసీదారుడి వయసు 55 ఏళ్లకు చేరినప్పుడు బీమా రద్దవుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి

ప్రీమియం వివరాలు :

పీఎంజేజేబీవై ప్రస్తుత ప్రీమియం ఏడాదికి రూ.436గా ఉంది. అంటే.. రోజుకు 1.20 పైసలు, నెలకు రూ.36 చొప్పున పడుతుంది.

ఒకే వాయిదాలో ఈ ప్రీమియం మొత్తాన్ని ఆటోడెబిట్ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు అకౌంట్ నుంచి చెల్లించాలి.

అయితే, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ పథకంలో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది.

LICతో పాటు దాదాపు అన్ని జీవిత బీమా సంస్థలు ఈ స్కీమ్ను అందిస్తున్నాయి. అలాగే.. బ్యాంకుల వద్ద కూడా PMJJBY స్కీమ్ అందుబాటులో ఉంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top