సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ లిమిట్ ఇంతే.. పరిమితి దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం..

 ఈరోజుల్లో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరికి అనివార్యమైంది. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్లను అందిస్తుండగా, మరి కొన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ తో సేవింగ్స్ అకౌంట్ సేవలు అందిస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతాలో క్యాష్ డిపాజిట్ పరిమితి గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ నుంచి నోటీసులు పొందాల్సి ఉంటుంది. పెనాల్టీ కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.


సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ లిమిట్ ఇంతే.. పరిమితి దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం..

క్యాష్ డిపాజిట్ లిమిట్ ఎంత?

సాధారణ సేవింగ్స్ అకౌంట్లో ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ - మార్చి ) క్యాష్ డిపాజిట్ పరిమితి రూ. 10 లక్షలు. ఒకవేళ రూ. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే బ్యాంకులు వెంటనే ఆదాయపు పన్ను శాఖకు సమచారాన్ని అందిస్తాయి. అప్పుడు ఐటీ శాఖ మీకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. రూ. 10 లక్షలకు మించిన డిపాజిట్లకు డబ్బ ఎక్కడి నుంచి వచ్చిందని ఆధారాలు కూడా అడుగుతుంది. కరెంటు ఖాతాలకు అయితే ఆర్థిక సంవత్సరానికి రూ. 50 లక్షల వరకు పరిమితి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం 1962, సెక్షన్ 114బీ ప్రకారం ప్రతి బ్యాంకు రూ. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను ఐటీ శాఖకు అందిచాల్సి ఉంటుంది. ఖాతాదారునికి ఎన్ని బ్యాంకు అకౌంట్ల ఉంటే అన్నింట్లో కలిపి ఆర్థిక సంవత్సరానికి రూ. 10 లక్షల వరకే డిపాజిట్ పరిమితి ఉంటుంది.

రోజుకు ఎంత డిపాజిట్ చేయవచ్చు?

సాధారంగా సేవింగ్స్ అకౌంట్లలో రోజుకు రూ. లక్ష వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు చాలా రోజులు లావాదేవీలు జరపకపోతే రూ. 2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించకూడదు. రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేసిన ప్రతిసారి పాన్ కార్డును పొందుపర్చాల్సి ఉంటుంది.


రూ. 10 లక్షలు మించి మీరు క్యాష్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు ఆధారాలు సమర్పించాలి. లేదంటే 60 శాతం ట్యాక్స్ తో పాటు, 25 శాతం సర్ ఛార్జ్, 4 శాతం సెస్ ను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 10 లక్షలకు మించి మీరు డిపాజిట్ చేసే డబ్బులో 89 శాతం పన్ను రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఆధారాలు పొందుపరిస్తే మాత్రం ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు.

ఎంత డబ్బు ఉండొచ్చు..?

సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బైనా ఉండవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. కానీ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి డిపాజిట్లు చేస్తే ఆధారాలు పొందుపర్చాలి.

సెక్షన్ 194ఎన్

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194 ఎన్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. కోటికి మించి నగదు విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. ఒకవేళ ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయని వారైతే రూ. 20 లక్షలకు మించి విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ ఉంటుంది. అదే రూ. కోటి దాటితే వీరికి 5 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.

కాబట్టి సేవింగ్స్ అకౌంట్లు ఉన్నవారు ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడకుండా ఉండాలంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిమితి దాటితే ఆధారాలు సమకూర్చుకోవాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top