రాజుగారి కోతి
అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది.
ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది.
కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది. కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది.
రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది.
ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గిర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి.
అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు
పొడుపు కథలు విప్పండి చూద్దాం.
విద్యార్థులు క్రింది కృత్యం చేయండి మీ నోట్ బుక్క లో నమోదు చేయండి
గణితములకు సంబంధించిన క్రింది కృత్యాన్ని చేయండి
0 comments:
Post a Comment