We Love Reading Summer Activities ( 6-10 Classes ) @10.04.24

మొహమాటం అల్లుడు

ఒక ఊరిలో ఒక యువకుడు వుండేటోడు. వానికి మొహమాటం చాలా ఎక్కువ. నోరు విప్పి ఏదీ అడిగేవాడు కాదు. ప్రతిదానికీ సిగ్గు పడిపోయేవాడు.

ఆ యువకునికి పెళ్ళయిన తరువాత మొట్టమొదటిసారిగా అత్తా వాళ్ళ ఇంటికి పండుగకు బైలు దేరినాడు. దారిలో బస్సు పంచరయ్యింది. దాంతో పది మైళ్ళు కిందా మీదా పడతా నడిచి అలసిపోయి ఇంటికి చేరినాడు. ఆకలి చంపుతోంది. పొద్దున ఎప్పుడో తిన్నదంతా అరిగిపోయింది. కానీ "ఆకలవుతా వుంది... ఏమన్నావుంటే పెట్టమని" అడగాలంటే ఒకటే సిగ్గు. చీకటి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగినాడు.

రాత్రి కాగానే “కాళ్ళు కడుక్కొని రా అల్లుడూ, అన్నం తిందువు గానీ" అని పిలిచింది అత్త. ఆ యువకుడు బెరబెరా కాళ్ళు కడుక్కోని సంబరంగా పోయి అందరితో బాటు భోజనానికి కూర్చున్నాడు.

మొహమాటం ఎక్కువ గదా... దాంతో ఎక్కువ తింటే ఏమనుకుంటారో అనుకుంటా నెమ్మదిగా ముద్ద ముద్ద కలుపుతా కొంచమే తిన్నాడు.

పడుకున్న కాసేపటికే మరలా ఆకలి కాసాగింది. చూస్తే పెళ్ళాం నిద్రపోతా వుంది. ఎవరినన్నా అడిగితే ఏమనుకుంటారో ఏమో అనుకున్నాడు.

నెమ్మదిగా లేచి వంటగదిలోకి చేరుకున్నాడు. అన్నం గిన్నెలన్నీ నున్నగా తోమి బోర్లించి కనబడినాయి. ఏమన్నా దొరుతాయేమో అని వెదకసాగినాడు. మూలన బియ్యం మూట కనబడింది. గబగబా రెండు పిడికిళ్ళ బియ్యం తీసుకొని నోటినిండా సందు లేకుండా పోసుకున్నాడు. తిరిగి పోదామని వెనక్కి తిరిగినాడు. అక్కడొక ఖాళీ చెంబు వుంది. చీకటిలో చూసుకోక దాన్ని తగిలినాడు. వెంటనే అది కింద పడి పెద్దగా చప్పుడు చేసుకుంటా దొర్లుకుంటూ పోయింది. ఆ చప్పుడుకు వంటగది బైట పడుకున్న అత్త లేచింది.

పిల్లి ఏమైనా వంటింట్లోకి దూరిందేమో అని లోపలికి పోయింది. చూస్తే ఇంకేముంది. అల్లుడు కనబడ్డాడు "ఏం నాయనా... నీళ్ళ కోసం వచ్చినావా" అని అడిగింది.

అల్లుని నోటి నిండా బియ్యం వున్నాయి గదా... నోరు తెరిస్తే అవి బైటపడి పరువు పోతుంది. దాంతో నోరు గట్టిగా మూసుకొని “ఊ... ఊ..." అంటూ సైగలు చేసినాడు.

“ఏంటబ్బా... అల్లుడు మాటకి మాట సమాధానం చెప్పకుండా సైగలు చేస్తున్నాడు" అని చూస్తే ఇంగేముంది. అల్లుని బుగ్గలు నున్నగా, లావుగా పూరీలు పొంగినట్లు పొంగి కనబడ్డాయి.

అత్త కంగారు పడి ఇంటిలో అందరినీ లేపింది.

అల్లునికి ఏం చేయాలో తోచలేదు. బియ్యం నోటి నిండుగా వుండడంతో వాటిని మింగలేకుంటున్నాడు. అందరి ముందు కక్కలేకుంటున్నాడు. విషయం బైట పడకూడదని నోరు మరింత బిగదీసుకొని కూర్చున్నాడు. నోట్లో ఎంగిలి వూరుతుంది గదా...

అది కొంచం కొంచం బియ్యంతో కలుస్తా వుంది. దాంతో బియ్యం మెత్తగయి ఉబ్బసాగినాయి. ఇంకేముంది... బుగ్గలు మరింత లావు కాసాగాయి. అది చూసి అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొని “రాత్రి అన్నం తినేటప్పుడు ఎంత ముచ్చటగా చందమామలా వున్నాడు. పన్నుకున్నప్పుడు మొహంమ్మీద ఏ పురుగు కుట్టిందో ఏమో... ఇలా బుగ్గలు బూరెల్లా పొంగి పోయాయి" అనుకుంటూ వెంటనే వైద్యున్ని పిలిపించినారు.

వైద్యుడు వచ్చి పరిశీలించినాడు. నోట మాట రావడం లేదు. పిచ్చి చూపులు చూస్తున్నాడు. గంటగంటకు బుగ్గలేమో ఉబ్బిపోతున్నాయి.

“నోటిలో ఏదైనా గడ్డ వచ్చిందేమో... దాంతో నొప్పికి వాచినట్టుంది. నోరు తెరిచి చూస్తే తప్ప లాభం లేదు" అన్నాడు.

కానీ నోరు తెరిస్తే తన బండారం బైట పడుతుంది గదా... దాంతో అల్లుడు ఎవరినీ మోహమ్మీద చేయి వేయనివ్వడం లేదు. మరింత బిగదీసుకుపోయినాడు.

దాంతో ఇక లాభం లేదనుకుని మామ వెనుకనుంచి గట్టిగా పట్టుకున్నాడు. పెళ్ళాం తల అటూయిటూ వూపకుండా బిగించి పట్టుకుంది. బావమరుదులు తలా ఒక చేయి పట్టుకున్నారు. వైద్యుడు బలమంతా ఉపయోగించి నోరు తెరిచినాడు.

అంతే... నోట్లో నుండి బియ్యం గింజలు జలజలజల రాలినాయి. అది చూసి అందరూ నోరెళ్ళబెట్టినారు. విషయం అందరికీ అర్థమయ్యింది.

"సొంతవాళ్ళ దగ్గర గూడా ఇంత మోహమాటమయితే ఎలా అల్లుడు... అందరం ఏమైందో అని అదిరిపోయినాం గదా" అంటూ పకపకపక నవ్వేసినారు.

విద్యార్థులు క్రిందికి బండి ఇంగ్లీష్ కృత్యాలు చేయండి


గణితమునకు సంబంధించిన కృత్యాలు చేయండి




సందులు  ఇంత ఈజీనా 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top