నూతనంగా నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S) నీరబ్ కుమార్ ప్రసాద్కి ఏపి జెఏసి పక్షాన ఛైర్మన్, సెక్రటరీ జనరల్ కె.వి.
కొత్త ప్రధాన కార్యదర్శిదృష్టికి ఉద్యోగ సమస్యలు: ఏపీ జేఏసీ
శివారెడ్డి, జి.హృదయ రాజు ఆధ్వర్యంలో విజయవాడ సి.యస్ క్యాంప్ కార్యాలయంలో కలిసి అభినందనలు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు అందని విషయం, బకాయిలు చెల్లించాలని, అనేక సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపి జెఏసి నాయకులు సి .యస్ కి కోరారు. మరికొన్ని ఉద్యోగల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. సి యస్ సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండి నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్టు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై జూన్ 12 తర్వాత ప్రత్యేకంగా మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
0 comments:
Post a Comment