నిరుద్యోగులకు, ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్‌న్యూస్. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
మరో వారం రోజుల్లో IBPS RRB, PO, క్లర్క్ నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ ibps.in లో విడుదల కానుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడగానే అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పోస్టుల ఖాళీల వివరాలతో ఐబీపీఎస్ అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.
* వారంలోగా ఐబీపీఎస్ నోటిఫికేషన్?
ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 1 (పీవో), ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల ఖాళీలు భర్తీ కానున్నాయి. నివేదికల ప్రకారం.. జూన్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. లేదంటే, జూన్ 15వ తేదీలోగా ఐబీపీఎస్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు సిలబస్, ఎంపిక ప్రక్రియ, తదితర వివరాలను ఈ నోటిఫికేషన్‌తో
* ఎగ్జామ్ క్యాలెండర్ ఇదే..
ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం వివిధ పోస్టులకు సంబంధించి ఆయా తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో జరగనుంది. ఇక, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఇదే తేదీల్లో ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2, 3 పరీక్ష సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన ఆఫీసర్ స్కేల్ 1 అభ్యర్థులకు సెప్టెంబర్ 29న మెయిన్స్ జరగనుంది. మరోవైపు, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 6న నిర్వహించనున్నారు.
* పీవో, క్లర్క్ పరీక్ష తేదీలు
ఐబీపీఎస్ పీవో ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 19, 20 తేదీల్లో జరగనుంది. ఇందులో సెలక్ట్ అయిన వారికి నవంబర్ 30న మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరోవైపు, ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 24, 25, 31 తేదీల్లో జరగనున్నాయి. మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 31న ఉంటుంది.
ఇంకా కన్ఫర్మ్ కాలేదు..
జూన్ మొదటి వారంలో లేదా జూన్ మధ్య నాటికి ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఐబీపీఎస్ అధికారులు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. నోటిఫికేషన్, తదితర అప్‌డేట్స్ కోసం క్యాండిడేట్లు ఐబీపీఎస్ అఫిషియల్ వెబ్‌సైట్ ఫాలో అవ్వాలి.
మరోవైపు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి IBPS క్యాలెండర్ 2024 ఇప్పటికే రిలీజ్ అయింది. అధికారిక వెబ్‌సైట్ www.ibps.inలో వివరాలు చెక్ చేసుకోవచ్చు. IBPS క్యాలెండర్ 2024లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్, RRB ఆఫీస్ అసిస్టెంట్, RRB ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టుల పరీక్ష తేదీలను పేర్కొన్నారు
0 comments:
Post a Comment