ఐఎఎస్, ఐపిఎస్ తరహాలో ఉద్యోగులకూ జీరో సర్వీసెస్ బదిలీలు?

 ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగుల తరహాలో సాధారణ ఉద్యోగులకు కూడా జీరో సర్వీసెస్‌తో బదిలీల ప్రక్రియ చేపట్టే దిశగా చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈనెల 12న చంద్రబాబు నేతృత్వంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 20 తరువాత బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది. జీరో సర్వీసెస్‌ పద్ధతిలో తహసీల్దార్‌ కంటే ఎగువనున్న అధికారుల పోస్టులు పాలనాపరంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అటెండర్‌ నుంచి తహసీల్దార్‌ స్థాయి కేడర్‌ గల ఉద్యోగులకు సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం ఏటా 20 శాతం మించకుండా బదిలీలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. కానీ కొంతకాలంగా అది అమలు జరగడం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్వీసెస్‌ రూల్స్‌కు మినహాయింపునిస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్లను ఐదునెలల క్రితం ఒక జిల్లా వారిని మరొక జిల్లాకు కేటాయించారు. దీంతో గత ఐదు నెలలుగా ఆయా ఉద్యోగులు

కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులను వారిని పూర్వపు జిల్లాలకు బదిలీలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందం శుక్రవారం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల టీచర్స్‌ బదిలీలకు సంబంధిం చిన ఫైల్‌పై ఆరోపణలు రావడంతో ఆయా బదిలీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం జీరో సర్వీసెస్‌ బదిలీలు అమలుచేస్తే రెవెన్యూ, పోలీస్‌, టీచర్లతోపాటు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతోపాటు దిగువస్థాయి కేడర్‌లో పనిచేసే ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంద

జీరో సర్వీసెస్‌ అంటే

జీరో సర్వీసెస్‌ అంటే ఎంతకాలం నుండి పనిచేస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏ స్థాయిలో పనిచేసే ఉద్యోగినైనా బదిలీ చేయొచ్చు. ప్రభుత్వంలో ఐఎఎస్‌, ఐపిఎస్‌లను ఎప్పుడైనా బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కిందిస్థాయి ఉద్యోగులకు కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఏడాదికి 20 శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయకూడదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top