ట్రిపుల్ ఐటీలకు 53వేల దరఖాస్తులు..
11న జాబితా విడుదల
ఆంధ్ర ప్రదేశ్:
IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
వీరికి జులై 22,23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి జులై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ .
0 comments:
Post a Comment