బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే భారతదేశం అంతటా తన 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే కొన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4జీ సేవలను ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఈ సేవను విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీకి వచ్చే అవకాశం ఉంది.
బీఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందా? ప్రైవేటు టెలికాం కంపెనీల హోరులో కనుమరుగైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అప్ డేట్ అవుతోంది. వారి బడ్జెట్ కు అనుగుణంగా అనువైన ట్యారిఫ్ లతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు..
బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే భారతదేశం అంతటా తన 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే కొన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4జీ సేవలను ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఈ సేవను విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల, కంపెనీ ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరలోనే ప్లాన్లను అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్లు ఇవి..
బీఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ.1198 కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ నెలకు 3జీబీ డేటా, 30ఎస్ఎంఎస్ లతో 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది
బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ. 1999 కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 365 రోజుల పాటు 600జీబీ డేటాతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ. 2999కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ప్రతి రోజు 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుం
0 comments:
Post a Comment