'తల్లికి వందనం' పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి వందనం' ఇస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన తల్లికి వందనం పథకాన్ని తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టుగానే ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు రూపొందించడానికి తమకు కొంత సమయం కావాలని లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
ఉత్తమ విధానాల అమలు
ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72వేల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు
0 comments:
Post a Comment