జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్!.. సైలెంట్‎గా నాలుగు కొత్త ప్లాన్స్

 జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టారు.


జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్‌లు

రూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లు (18 రోజులు) ఉన్నాయి.

రూ.209 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు 'బీఎస్ఎన్ఎల్'కు మారిపోతున్నారు. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top