UPI News: UPI పేమెంట్స్ రివర్స్ చేయొచ్చు తెలుసా? ఇలాచేస్తే పోయిన డబ్బు ఈజీగా వెనక్కి వస్తుంది

UPI Reversal: భారత పేమెంట్స్ సిస్టమ్ దినదినాభివృద్ధి చెందుతూ సరిహద్దులు దాటి దూసుకుపోతోంది. ఇరుగుపొరుగు దేశాలతో పాటు UAE, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లోనూ సత్తా చాటుతోంది.



టెక్నాలజీ బాగానే ఉన్నా, మానవ తప్పిదాల వల్ల ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకరికి చెల్లించాల్సిన నగదు అనుకోకుండా వేరొకరికి క్రెడిట్ అయితే ఎలా స్పందించాలి అనేది చాలా మందికి తెలియదు.

UPI ద్వారా పేమెంట్స్ చేసే సమయలో వినియోగదారులు తప్పుగా మరో వ్యక్తికి నగదు బదిలీ చేసే ప్రమాదం ఉంది. ఆ పరస్థితుల్లో దిగులు పడాల్సిన పనిలేదు. ఈ తరహా లావాదేవీలను రివర్స్ చేయవచ్చు. దీంతో సదరు వినియోగదారుల డబ్బు ఎక్కడికీ పోదు, తిరిగి అకౌంట్‌కి వచ్చి చేరుతుంది. అయితే ఇందుకోసం ఓ ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుంది.

తప్పు లావాదేవీకి సంబంధించి పరిహారం పొందేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. npci.org.inని సందర్శించి 'డిస్ప్యూట్ రిడ్రసల్ మెకానిజమ్' విభాగానికి వెళ్లాలి. అక్కడ 'కంప్లైంట్' ట్యాబ్ ఎంచుకుని అవసరమైన వివరాలను నమోదే చేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం UPI లావాదేవీ ID, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ అమౌంట్, లావాదేవీ తేదీ, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ వీటితో పాటు కట్ అయిన మొత్తాన్ని చూపుతూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.

NPCI వెబ్‌సైట్ ప్రకారం మొదటి దశలో సదరు UPI లావాదేవీ జరిపబడిన పేటీఎం వంటి TPAPకు ఫిర్యాదు పంపబడుతుంది. అక్కడ పరిష్కారం దొరకని పక్షంలో సంబంధిత PSP బ్యాంక్‌ దాన్ని పంపిస్తుంది. తదుపరి స్థాయిలో NPCI విచారణ జరుపుతుంది. ఇక చివరి దశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలోని బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top