Women Teachers Leaves - Women s Different types of Leaves

మహిళా దినోత్సవం-ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

1. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది
(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)

2.ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
(G.O.Ms.No.27 తేది:09-01-2004)

3. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
(G.O.Ms.No.350 తేది:30-07-1999)

4.అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
(Memo.No.17897 తేది:20-04-2000)

5. పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ
ఉత్తర్వులు.
(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)

6. ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
(మెమో.నం.7679 తేది:14-09-2010)

7. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)

8.మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
(G.O.Ms.No.374 తేది:16-03-1996)

9 .జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
(G.O.Ms.No.03 తేది:05-01-2011)

10.వివాహం ఐన మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.
(G.O.Ms.No.152 తేది:04-05-2010)

11.మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

12. మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)

13. ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)

14. మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)

15.చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)

16. మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
(G.O.Ms.No.209 తేది:21-11-2016)


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top