ధ్రువ’ పోర్టల్‌-ప్రయోజనాలు

★ ధ్రువ పోర్టల్‌లో ప్రతి విద్యార్థికి ఒక డిజిటల్‌ లాకర్‌ ఉంటుంది. అందులో ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు తమకు కావలసినప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. చదువు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు...తమ లాకర్‌ లింక్‌ను దానిలో పొందుపరిస్తే, ఆయా సంస్థలే నేరుగా ఆ సర్టిఫికెట్లు చూసుకోవచ్చు.

★ మార్కుల జాబితాలను, ఇతర విద్యా సంబంధిత ధ్రువ పత్రాలను ఇకపై ఆయా బోర్డులు, యూనివర్సిటీలు పరీక్ష ఫలితాలు వెలువడ్డాక.. ఎలక్ట్రానిక్‌ రూపంలో మార్కుల జాబితాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేస్తాయి. వాటిపై ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన వారి డిజిటల్‌ సంతకం ఉంటుంది. వాటిని ధ్రువ సర్వర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

★ ప్రతి సర్టిఫికెట్‌పైనా ‘ధ్రువ’ ముద్ర ఉంటుంది. ఆ సర్టిఫికెట్లు అసలైనవేనని ఆ ముద్ర ధ్రువీకరిస్తుంది.

★ ‘ధ్రువ’లో విద్యార్థుల ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వంటి వ్యక్తిగత వివరాల్ని పూర్తి భద్రంగా ఉంచుతారు. విద్యార్థులు ఎంత వరకు సమాచారం ఇవ్వాలనుకుంటే, అంత వరకే ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.

★ అందరికీ అలవాటయ్యేంత వరకు ఒకటి రెండు సంవత్సరాలపాటు ఎలక్ట్రానిక్‌ రూపంలోనూ, కాగితంపైనా మార్కుల జాబితాలను, ధ్రువపత్రాలను ఇస్తారు. ఆ తర్వాత అంతా ఎలక్ట్రానిక్‌ రూపంలోకి తీసుకొస్తారు.

★ ఒక విద్యార్థి తన హాల్‌టికెట్‌ నంబరుతోగానీ, ఆధార్‌ నంబరుతో గానీ డిజిటల్‌ లాకర్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

★ ‘ధ్రువ’ పోర్టల్‌తోపాటు, యాప్‌ ద్వారాను ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు.

★ 2004 నుంచి డిజిటల్‌ రూపంలో విద్యార్థుల సమాచారం అందుబాటులో ఉండటంవల్ల, వారందరికీ ఎలక్ట్రానిక్‌ ధ్రువపత్రాలను రూపొందించేందుకు ధ్రువ ప్రాజెక్టు సన్నాహాలు చేస్తోంది.

★ 1980 నుంచి 2004 మధ్య జారీ చేసిన సర్టిఫికెట్లను సైతం స్కాన్‌ చేసి... డిజిటల్‌ వ్యాలెట్‌లో అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు.

★ ఇకపై కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌ కార్డులు, సాగు ధ్రువీకరణ పత్రాలు, భూసార పరీక్ష పత్రాల వంటివన్నీ ఎలక్ట్రానిక్‌ రూపంలోనే జారీ చేయనున్నారు.

★ ధ్రువలో ప్రతి పౌరుడికి డిజిటల్‌ లాకర్‌లో ప్రాథమికంగా 10 ఎంబీ స్టోరేజీ సదుపాయం ఇస్తారు.
అవసరాన్ని బట్టి పెంచుతారు

★ కేంద్ర ప్రభుత్వ ‘డిజిలాకర్‌’తో పోలిస్తే ధ్రువ పూర్తిగా భిన్నమైంది. డిజిలాకర్‌లో పౌరులు నేరుగా తమ సర్టిఫికెట్లను భద్రపరుచుకోవచ్చు. కానీ.. అవి అసలైనవని ధ్రువీకరించిన తర్వాతే ‘ధ్రువ’ ముద్ర పడుతుంది.

★ ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్‌ కోసమో, సంస్థలో ఉద్యోగం కోసమో ఇతర రాష్ట్రాలకో, దూర ప్రాంతాలకో వెళ్లాల్సి వచ్చినా సర్టిఫికెట్లు వెంట తీసుకుని వెళ్లాల్సిన పని ఉండదు.

★ సర్టిఫికెట్లన్నీ ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటాయి కాబట్టి... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ధ్రువ పోర్టల్‌ ద్వారానే వాటిని పరిశీలించుకోవచ్చు.

★ భూముల కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన పత్రాల్ని ధ్రువలోని ‘మై ల్యాండ్‌’ విభాగంలో పొందుపరుస్తారు.

★ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల్నిగానీ, వేరే ఎవర్నైనాగానీ డిజిటల్‌ లాకర్‌కు నామినీగా నియమించుకునే వెసులుబాటు కల్పిస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top