LHMS AP Police Mobile App

 పిల్లలకు పరీక్షలు ముగిసాయి వేసవి సెలవులు ఇచ్చారు ఈ సెలవుల్లో అందరూ పిల్లలు తీసుకుని బంధువుల ఇళ్లకు విహార యాత్రలకు వారి సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాంటి సమయంలో ఇక్కడ మనము తాళాలు వేసిన ఇంటికి భద్రత అవసరం  వేసవి లో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నది దొంగతనాలు నివారించడానికి పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయుచున్నది ఆ ఏర్పాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

LHMS AP Police App

 పోలీసు శాఖతో ఇలాంటి సెక్యూరిటీ కావలసిన వాళ్ళు ప్లే స్టోర్ నుండి ఎల్ హెచ్ ఎం ఎస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏదైనా పనిమీద ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే 24 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ప్రత్యేకంగా మన ఇంటికి కెమెరాలు బిగిస్తారు

ఎలా మానిటర్ చేస్తారు కెమెరా ఎలా పనిచేస్తుంది?

 ఈ కెమెరాను నగరంలోని కంట్రోల్ ఎన్నింటికి అనుసంధానం చేస్తారు ఈ కెమెరా చీకట్లో కూడా పనిచేస్తుంది దాని పరిధిలో ఏదైనా కదలికలు ఉంటే సెన్సార్ పసికట్టి కంట్రోల్ రూమ్ కి సంకేతం ఇస్తుంది పోలీస్ సిబ్బంది  అప్రమత్తమై ఆ ఇంటి సమీపంలో గస్తీ బృందానికి  సమాచారం ఇస్తారు అక్కడికి వెళ్లి వారు  దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top