CCE పరీక్ష విధానం లో సంస్కరణలు

O. No. 41, తేదీ 28/6/2019
 _CCE పరీక్ష విధానం లో సంస్కరణలు:_ 
G.O. No. 80 తేదీ 25/10/ 2017 మరియు G.O. No.62, dt  18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 10వ తరగతి లో 20% ఇంటర్నల్ మార్కుల వలన ప్రైవేటు విద్యాసంస్థల లో 10 /10 గ్రేడ్ పాయింట్లు అసాధారణ రీతిలో పెరగడాన్ని గమనించిన ప్రభుత్వం దీనిపై గత మే లో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 20% ఇంటర్నల్ మార్కులను తొలగించాలని సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. సదరు నివేదిక ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ జీవో 41ను విడుదల చేసింది.

 ఇందులోని ముఖ్యాంశాలు:_

1) _విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది._
_80% S.A.2 ఫైనల్ పరీక్ష నుండి, 20% మార్కులు ఇంటర్నల్ గాను కేటాయిస్తారు._
2) 6 నుండి 9 తరగతులకు 20% ఇంటర్నల్ మార్కుల ను 4 F.A. ల నుండి (50x4=200 m), మరియు S.A. 1లో  80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులకు లెక్కిస్తారు.
3) _10వ తరగతి విద్యార్థులకు 20% ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఎస్ఏ 1 పరీక్ష, ప్రీ ఫైనల్ పరీక్షలు, బోర్డు పరీక్షలు.. ప్రస్తుతం ఉన్న 11 పేపర్ల విధానంలోనే 100 మార్కులకు నిర్వహిస్తారు._
_పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది._
4) కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.
5) _పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు._
6) 6 నుండి 10 తరగతుల SA1, SA 2 ప్రశ్నా పత్రాలు SCERT వారిచే గోప్యంగా రూపొందించబడి తగు పాస్వర్డ్ రక్షణతో DCEB లకు పంపుతారు. DCEB లు వాటిని ప్రింట్ చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుంది.
7) 6 – 9 తరగతుల ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బ్లూప్రింట్, వెయిటేజ్, నమూనా ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ బ్యాంక్ లను & 10 వ తరగతి కి మోడల్ ప్రశ్నాపత్రాలను SCERT వారు విడుదల చేస్తారు.
8) _DEO చైర్మన్ గా గల DCEB ప్రశ్నాపత్రా లను ప్రింట్ చేయించి స్కూల్స్ కు సరఫరా చేస్తారు._
9) _1 నుండి 5 తరగతుల ప్రశ్నా పత్రాలు SCERT వారిచ్చిన క్వశ్చన్ బ్యాంకు నుండి జిల్లా కామన్ బోర్డువారు తయారు చేసి, స్కూల్స్ కు సరఫరా చేస్తారు..._
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top