Gramasachivslayam Candidates Certificate verification Certain Guidelines

రేపటి నుంచి కాల్‌ లెటర్లు..
రాతపరీక్షల ఫలితాల్లో జిల్లాలవారీగా మెరిట్‌ జాబితాలను వర్గీకరించి ఆయా ప్రాంతాలకు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)లు పోస్టుల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ అభ్యర్ధులకు కాల్‌ లెటర్లు పంపిస్తాయి. ఎంపికైన వారికి శని, ఆదివారాల్లో కాల్‌ లెటర్లు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట హాజరు కావాలి.

ఉత్తీర్ణుల సంఖ్య కేటగిరీలవారీగా..


ఓపెన్‌ -  24,583
బీసీ   - 1,00,494
ఎస్సీ  -  63,629
ఎస్టీ   -   9,458
పరీక్షకు హాజరైన అభ్యర్థులు  - 19,50,630
ఉత్తీర్ణులు - 1,98,164

కేటగిరీలవారీగా అభ్యర్థులు సాధించిన గరిష్ట మార్కులు

ఓపెన్‌ కేటగిరిలో అత్యధికంగా - 122.5
బీసీ కేటగిరిలో అత్యధికంగా - 122.5 
ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా - 114
ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా -108
మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా - 112.5
పురుష అభ్యర్థుల్లో  గరిష్టంగా - 122.5
ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు 10% వెయిటేజ్‌ మార్కులు విడిగా కలిపారు.

వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ 

వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ - 21.09.2019  నుంచి
కాల్‌ లెటర్ల జారీ - 21.09.2019 – 22.09.2019
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ - సెప్టెంబర్‌ 23– 25
నియామక ఉత్తర్వుల జారీ - 27.09.2019
అవగాహన కార్యక్రమం - 1–2 అక్టోబర్‌ 2019
గ్రామ/వార్డు సచివాలయాల ప్రారంభం -  02.10.2019

Download Guidelines
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top