YSR Raithu Barosa Scheme వైఎస్సార్‌ రైతు భరోసా పథకం పూర్తి వివరాలు

వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వచ్చే నెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు భరోసా పథకం మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయదారుల కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం 2019 – 20 రబీ నుంచి అమలవుతుంది. రైతు కుటుంబాలకు, భూమిలేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ పథకం విధివిధానాలకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ సమర్పించిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వాటికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ఉద్దేశాలు మొదలు ఎవరెవరు అర్హులు.. ఎంత మొత్తం అందిస్తారు..

అర్హులను ఎప్పటిలోగా గుర్తిస్తారు.. వంటి అంశాలను ఉత్తర్వులలో వివరించారు. వాస్తవానికి ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రబీ నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ విధివిధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 అందజేస్తుంది. ఎంత భూమి ఉందనే దానితో నిమిత్తం లేకుండా ప్రతి రైతు కుటుంబానికి ఈ ఆరి్థక సాయం అందుతుంది. భూ యాజమాన్యానికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను ఆధారం చేసుకుని లబి్ధదారులను గుర్తిస్తారు. భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ నుంచే ఏటా రూ.12,500 చెల్లిస్తారు. వ్యవసాయం, ఉద్యాన, పట్టు సాగు (సెరికల్చర్‌) సహా అన్ని వ్యవసాయ పంటలు పండించే సాగుదార్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

రైతు కుటుంబం అంటే..

భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబాన్ని రైతు కుటుంబంగా పరిగణిస్తారు. పెట్టుబడి సాయం కోసం పెళ్లయిన పిల్లల్ని ప్రత్యేక కుటుంబంగా పరిగణిస్తారు. భూమి ఉన్న వ్యక్తిని లేదా యజమాని చట్టపరంగా గుర్తించిన వ్యక్తిని భూ యజమానిగా లెక్కిస్తారు. ఎవరిదైనా భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే.. భూమి లేని వాస్తవ సాగుదారును కౌలుదారు లేదా సాగుదారుగా గుర్తిస్తారు. వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం పేదలకు ఇచి్చన అసైన్డ్‌ భూములు సహా వ్యవసాయం, ఉద్యాన, సెరికల్చర్‌ పంటల కోసం ఉపయోగించే భూమిని వ్యవసాయ భూమిగా గుర్తిస్తారు. జూన్‌ 1 నుంచి ఆ తర్వాత ఏడాది మే 31 వరకు మధ్యకాలాన్ని వ్యవసాయ సంవత్సరంగా లెక్కిస్తారు. భూ యజమాని, సాగుదార్ల మధ్య పంటలు పండించేందుకు కుదిరే ఒడంబడికను అగ్రిమెంటు లేదా ఒప్పందంగా భావిస్తారు. వ్యవసాయ భూమికి సంబంధించి రె?వెన్యూ రికార్డులలో ఎటువంటి పేర్లు లేకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చేదాన్ని సాగు ఒప్పంద పత్రంగా పరిగణిస్తారు.

ఈ పథకం వర్తించనివారు..  1.  అత్యధిక ఆర్థిక హోదా ఉన్న వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించారు. వారిలో సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న వారి కుటుంబాలు.
  2. గతంలో లేదా ప్రస్తుతం మంత్రులుగా, సహాయ మంత్రులుగా ఉన్న వారు, గతంలో లేదా ఇప్పుడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, శాసనమండలి సభ్యులుగా, మేయర్లుగా, జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా పని చేసిన వారి కుటుంబాలు.
  3. ప్రస్తుతం ప్రభుత్వ సేవల్లో ఉన్న, లేదా పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, మంత్రిత్వ కార్యాలయాలు లేదా వాటి అనుబంధ విభాగాలలో పని చేసినవారు.ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాలు, 
  4. ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్వతంత్ర సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల రెగ్యులర్‌ ఉద్యోగులు (స్థానిక సంస్థల్లోని గుమాస్తాలు, క్లాస్‌ – 4 సిబ్బంది, గ్రూప్‌ – డి ఉద్యోగులకు మినహాయింపు)
  5. నెలకు రూ.పది వేలు లేదా అంతకు మించి పెన్షన్‌ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. (గుమాస్తాలు, క్లాస్‌–4 సిబ్బంది, గ్రూప్‌–డి ఉద్యోగులకు మినహాయింపు)
  6. వృత్తిపరమైన సంస్థల కింద రిజిస్టర్‌ అయి తమ వృత్తులను కొనసాగిస్తూ గత ఏడాది కాలానికి ఆదాయపన్ను చెల్లించిన డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు కూడా అనర్హులు.
  7. యావసాయ భూములను ఇళ్ల పట్టాలుగా, ఆక్వా చెరువులుగా మార్చుకున్న వారికి ఈ పథకం వర్తించదు.
  8. వ్యవసాయ భూములను మరేదైనా వ్యవసాయేతర అవసరాలకు మార్చినా ఈ పథకం వర్తించదు. (రెవెన్యూ రికార్డులలో ఉన్నా లేకున్నా సరే) రెవెన్యూ, వ్యవసాయ విభాగాల గ్రామ స్థాయి అధికారులు ఈ వ్యవహారమై క్షేత్రస్థాయి విచారణ జరిపి నిర్ధారిస్తారు.
  9. గత మదింపు సంవత్సరానికి వాణిజ్య, వృత్తి పన్నులు, జీఎస్టీ చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తించదు.


ఇవీ అర్హతలు 

1.భూ యజమానులైన రైతు కుటుంబానికి ఎంత భూమి ఉందనే దానితో నిమిత్తం లేకుండా ఈ పథకం కింద ఏటా రూ.12,500 (వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.6,500, పీఎం– కిసాన్‌ పథకం కింద రూ.6000) లబ్ధి అందుతుంది. భూ రికార్డుల ప్రకారం ప్రతి కుటుంబాన్ని గుర్తిస్తారు.

2.ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములు, డి పట్టా భూములను (సంబంధిత రికార్డులలో చేర్చి ఉండాలి) సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు.

3.భూ సేకరణ పథకం కింద సేకరించి, నష్టపరిహారం చెల్లించని వ్యవసాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు.

4.ఉమ్మడి ఆస్తి వ్యవహారంలోనైతే ఆ కుటుంబంలో ఎవరిపేరిటైతే ఎక్కువ భూమి ఉంటుందో వారి బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తారు.

5.ఒకవేళ కుటుంబంలో ఇద్దరు లేదా అంతకు మించిన వారికి సమానంగా సాగు భూమి ఉన్నట్టయితే వారిలో పెద్దవారి ఖాతాకు నగదును బదిలీ చేస్తారు.

ఈ పథకం కింద అర్హులైన లబి్ధదారుల గుర్తింపునకు తుది గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారు.

రైతు కుటుంబ యజమానుల గుర్తింపు పద్ధతి  

రెవెన్యూ విభాగం వద్ద నున్న వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆరీ్టజీఎస్‌) విభాగం భూమి ఉన్న కుటుంబాల వివరాలను తీసుకుంటుంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక సమాచారం ఇదే. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేస్తాయి. ఆరీ్టజీఎస్‌ డేటాను అప్‌లోడ్‌ చేయబోయే ముందు సేకరించిన సమాచారాన్ని వివిధ దశల్లో పరిశీలిస్తుంది. గ్రామ స్థాయిలో బహుళ ప్రయోజన విస్తరణాధికారులు (గ్రామ వ్యవసాయ సేవకులు, వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు) సమన్వయంతో సంయుక్తంగా సేకరించే సమాచారాన్ని మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
డివిజన్‌ స్థాయిలో వ్యవసాయ సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, రెవెన్యూ డివిజినల్‌ అధికారులు తనిఖీ చేస్తారు. చివరిగా వ్యవసాయ జేడీఎ సహాయంతో జిల్లా కలెక్టర్‌ నిర్దారిస్తారు. ఆ తర్వాత ఆరీ్టజీఎస్‌ డేటాను ఆప్‌లోడ్‌ చేస్తుంది. మండల స్థాయిలో 5 శాతం, డివిజన్‌ స్థాయిలో 2 శాతం సమాచారాన్ని ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు డెప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారిని నియమిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేసే పనిని ఆరీ్టజీఎస్‌ విభాగం చేపడుతుంది.  వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కోసం ఆరీ్టజీఎస్‌ ఒక వెబ్‌ పోర్టల్‌ను, మొబైల్‌ అప్లికేషన్‌ను తయారు చేస్తుంది. లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. కాగా లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారానికి వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు.

భూమి లేని సాగుదారులు

1.కౌలు రైతు/కుటుంబ సభ్యునకు ఎటువంటి వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ భూమి ఉండకూడదు. కుటుంబ సభ్యుల మధ్య కౌలు ఒప్పందాలకు ఈ పథకం వర్తించదు.

 2.భూ విస్తీర్ణం ఎంతయినా ఒక భూ యజమాని ఒక కౌలుదారుతో మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవాలి.

 3.భూమిలేని కౌలుదారు ఒకటి కంటే ఎక్కువ కౌలు ఒప్పందాలు చేయించుకున్నా వాటన్నిం టిని కలిపి ఒక యూనిట్‌గానే పరిగణిస్తారు.

 4.భూ యజమానితో పాటు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఒక కౌలు రైతుకు మాత్రమే ఈ పథకం కింద అర్హత ఉంటుంది.

 5.గిరిజన ప్రాంతాలలో చట్ట ప్రకారం కేవలం గిరిజన సాగుదార్లు, కౌలుదార్లను మాత్రమే గుర్తిస్తారు.

 6.ఒకే గ్రామంలోని భూమిలేని కౌలుదారులు, సాగుదారులు, సన్నకారు రైతుల మధ్య లీజు ఒప్పందాన్ని ఈ పథకం కింద లబి్ధకి అర్హులుగా పరిగణించరు.

 7.ఈనాం భూములు, ఎండోమెంట్‌ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. ఎండోమెంట్స్‌ విభాగం వారి రికార్డుల ఆధారంగా వీరిని గుర్తిస్తారు.

భూమి లేని కౌలుదారు కనీసం కౌలుకు సాగు చేయాల్సిన విస్తీర్ణం

పంట        కౌలు చేయాల్సిన     కనీస భూమి
ఆహార ధాన్యాలు, అపరాలు, నూనె గింజలు,పత్తి, మిరప, పొగాకు - ఒక ఎకరం (0.4 హెక్టార్‌)
కూరగాయలు, పశుగ్రాస పంటలు -  అర ఎకరం (0.2 హెక్టార్‌)
తమలపాకు  - పది సెంట్లు (0.04 హెక్టార్‌)     
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top