Amazan Diwali Festival Offers అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌

అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌ను  శనివారం ప్రకటించింది. 

అక్టోబర్‌ 21 అర్థరాత్రి నుంచి 25వ తేదీవరకు  ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహిచనుంది.

ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది.


 ప్రైమ్ సభ్యుల కోసం  అక్టోబర్ 20 ఉదయం 12 గంటల నుంచే  ప్రత్యేకమైన  సేల్‌, స్పెషల్‌ అఫర్లను కూడా అమెజాన్‌ ప్రకటించింది.


ఆపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.


ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60శాతం దాకా డిస్కౌంట్‌ లభ్యం. వన్‌ప్లస్ 7టీ,  శాంసంగ్ ఎం 30ఎస్, వివో యు10 తో  సహా అమెజాన్ స్పెషల్స్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరల్లో  అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.


  దీంతోపాటు నోకాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్‌సర్వ్‌ కార్డులు,  అమెజాన్ పే,  ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై  అపరిమిత రివార్డ్ పాయింట్లుతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
 
అంతేకాదు ఎల్‌జీ (43) 4 కె స్మార్ట్ టీవీ వర్ల్‌పూల్‌ కన్వర్టిబుల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, శాంసంగ్‌ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతోపాటు, కొత్తగా ప్రారంభించిన సాన్యో కైజెన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్‌ వెల్లడించింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top