ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ల ఆఫర్లు

ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్' ప్రకటించింది. 19న ప్రారంభం కానున్న ఈ సేల్ 22 వరకు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు జనవరి 18 రాత్రి 8 గంటలకే సేల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ లేదా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందివ్వనున్నారు. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. మరియు ఎప్పటిలాగానే స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. మరి ఈ సేల్‌లో మంచి ఆఫర్స్ ఉన్న స్మార్టఫోన్లపై ఓ లుక్కేసేయండి


రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32 జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499 కాగా, ఆఫర్ ధర రూ.6,999కే లభిస్తుంది. రెడ్‌మీ 8ఏ.. రెడ్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. రెడ్‌మీ 8ఏ 2జీబీ+32 జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,499 కాగా, ఆఫర్ ధర రూ.5,999కే లభిస్తుంది. ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్ 6 జీబీ+128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,990 కాగా, ఆఫర్ ధర రూ.14,990. ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,499 కాగా, ఆఫర్ ధర రూ.11,990. ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందొచ్చు.
రియల్‌మీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా, ఆఫర్ ధర రూ.7,999కే లభిస్తుంది. మోటోరోలా వన్ విజన్ 4 జీబీ+128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.13,999 తగ్గింపు పొందొచ్చు. మోటోరోలా వన్ యాక్షన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా, ఆఫర్ ధర రూ.8,999. కాగా, ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో ప్రతి 8 గంటలకు ఒకసారి బెస్ట్‌ డీల్స్‌ను అందివ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్‌, యాక్ససరీలపై 80 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం, ఫ్లిప్‌కార్ట్‌ బ్రాండ్లపై 80 శాతం వరకు రాయితీలను అందివ్వనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top