కొత్త రేషన్ కార్డులు సిద్ధం

 కొత్త కార్డులు సిద్ధం

★ ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

★ కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటోకు బదులు కార్డు ఎవరి పేరున మంజూరైందో వారి ఫొటోనే ఉంటుంది.

★ కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరుగా ఐడీ నంబర్లు ఇచ్చారు. కార్డు ఏ రేషన్‌ డీలర్‌ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు.

★ కొత్త కార్డుల్లో పుట్టిన తేదీతో సహా ముద్రించారు. కార్డుల్లో పేర్లు, ఇతర సమాచారం తప్పుల్లేకుండా ఉండేందుకు గ్రామ, వార్డు వలంటీర్‌ ద్వారా మరోమారు క్షేత్ర స్థాయిలో విచారించి వివరాలు సరైనవేనని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులను తయారు చేశారు.

★ కార్డులో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ వివరాలున్నాయి. సరుకులు అందకుంటే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ 1902 / 1967 / 18004250082 నంబర్లను కూడా కొత్త కార్డులో ముద్రించారు. 
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top