అధిక రక్తపోటుని (BP) మరియు డయాబెటీస్‌ ఈవిధంగా కంట్రోల్ చేసుకోవచ్చు.....

కరివేపాకుతో డయాబెటీస్‌ దూరం..
నేటి కాలంలో షుగర్‌ వ్యాధి చాలా కామన్‌ అయిపోయింది. 30 ఏళ్లు దాటిన చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొంతమందికి ఆ వయసుకి ముందే ఈ సమస్య వచ్చేస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. ఇది శరీరాలపై దాడి చేస్తుంది. అయితే, ఈ సమస్యకు కరివేపాకు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కరివేపాకులోని ఎన్నో గొప్ప గుణాలు చాలా వరకూ డయాబెటిస్‌ వ్యాధిని దూరం చేస్తుందని చెబుతున్నారు.
అయితే, ఇందుకు కరివేపాకులను నేరుగా తింటే ఫలితం ఉంటుంది. అలా కాదంటే పొడులు, పచ్చళ్లు చేసుకుని తినొచ్చని సూచిస్తున్నారు.

పెరుగుతో హైబీపీ దూరం.. 

హైబీపీ ఇది ఒంట్లోకి చేరగానే అనేక అనర్థాలకు దారితీస్తుంది. హైబీపీ రాగానే ఈ సమస్యకి తోడుగా మరికొన్ని మన ఒంట్లోకి చేరతాయి. అందుకే ఈ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా హైబీపీ వస్తుంటుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించండి. ఒకవేళ ఇదివరకే సమస్య వచ్చి ఉంటే... పెరుగుని తినడం వల్ల సమస్య చాలా వరకూ అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పెరుగుని నేరుగా అయినా తీసుకోవచ్చు, మజ్జిగలా చేసుకుని తాగొచ్చు.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top